మైసూర్ శాండిల్ సబ్బుని గబ్బు పట్టించిన బీజేపీ!

బాగా ఫేమస్ అయిన “మైసూర్ శాండల్ సోప్” ని కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలోని “కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్” (కె.ఎస్.డి.ఎల్) ఉత్పత్తి చేస్తుంది. సో.. ప్రభుత్వం తరపనే ఈ ఫ్యాక్టరీకి చైర్మన్ ఉంటారు. ఇందులో భాగంగా… ప్రస్తుతం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప.. కె.ఎస్.డి.ఎల్. కు చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు ఒక పుత్రరత్నం ఉన్నారు. వీరిద్దరే ఇప్పుడు మైసూర్ శాండల్ సబ్బుని గబ్బు పట్టించే పని చేశారు!

వివరాళ్లోకి వెళ్తే… ఈ కె.ఎస్.డి.ఎల్. ఫ్యాక్టరీలో సబ్బులు తయారు చేసేందుకు అవసరమైన ముడి సరుకులను ప్రభుత్వ సూచనతో అధికారులే కొనుగోలు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో… కె.ఎస్.డి.ఎల్ చైర్మన్ విరూపాక్షప్ప… బెంగళూరు వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు లో చీఫ్ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్న ఆయన పుత్రరత్నం ప్రశాంత్ కుమార్ లు కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు డిమాండ్ చేశారు!

అవును… ఒక కాంట్రాక్టర్ ను ఏకంగా 81 లక్షల రూపాయలు లంచం అడిగారట ఈ తండ్రీ కొడుకులు. దీంతో… ఆ కాంట్రాక్టర్ లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో మాటువేసిన లోకాయుక్త అధికారులు… ప్రశాంత్ కుమార్ 40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నారు. దీంతో తండ్రీకొడుకుల ముడుపుల భాగోతం వెలుగులోకి వచ్చింది!

సరిగ్గా కర్నాటక ఎన్నికల సమయంలో ఇలా బీజేపీ ఎమ్మెల్యే, ఆయన తనయుడి అవినీతి భాగోతం సాక్ష్యాలతో సహా బయటపడటంతో విలవిలలాడుతుందట కమల దళం. బీజేపీ ఎమ్మెల్యే తనయుడు అరెస్ట్ కావడం, ఈ యవ్వారంలో ఎమ్మెల్యేకి కూడా పాత్ర ఉందని తేలడంతో నోటికి పనిచెప్పాయి ప్రతిపక్షాలు! మరి ఈ వ్యవహారంపై “తమ పాలనలో అవినీతి లేదు” అని చెప్పుకునే బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!

కాగా… క్రీ.శ.1916 సంవత్సరం నుండి నల్వాడి కృష్ణరాజ ఒడయార్ .. మైసూరు మహారాజుగా రాజ్యం చేస్తున్న కాలంలో ఈ సబ్బుల కర్మాగారం బెంగుళూరులో స్థాపించబడింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మైసూరు సామ్రాజ్యం నుండి ఐరోపా ఖండానికి చందనం కలప ఎగుమతి ఆగిపోవడంతో.. అధికమైన చందన నిల్వల వినియోగం ఈ కర్మాగార స్థాపనకు ప్రధాన కారణం అయ్యిందని చెబుతుంటారు!

YouTube video player