జూ.ఎన్టీఆర్ పై జపాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు… వీడియో వైరల్!

తాతకుతగ్గ మనవడిగా తనదైన నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసును దోచుకుని టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరీ పరిచయం అవసరం లేదన్నా అతిశయోక్తి కాదు. ఇదే సమయంలో ఆర్.ఆర్.ఆర్. తో గ్లోబల్ స్టార్ గా కూడా జూనియర్ మరిపోయాడు.

ఆ సినిమాలో జూనియర్ నటవిశ్వరూపానికి ఫిదా అవ్వని సినిమా ప్రేక్షకుడు ఉండడు అన్నా అతిశయోక్తి కాదేమో. అయితే అది కేవలం తెలుగువారికో, దక్షిణాదివారికో, భారతీయులకో, విదేశాల్లో ఉన్న భారతీయులకో అనుకుంటే పొరపాటే. జపాన్ మంత్రికి కూడా జూనియర్ నటన తెగనచ్చేసింది.

అవును… ఆర్.ఆర్.ఆర్. వల్ల ఎన్టీఆర్ కి ఇంటర్నేషనల్ లెవెల్ భారీ ఫాలోయింగ్ ఏర్పడిందనడంలో సందేహం లేదు. దీంతో విదేశాల్లోని సామాన్య ప్రజలే కాదు.. విదేశీ మంత్రులు కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అయ్యిపోతున్నారు. ఈ లిస్ట్ లో జపాన్ మంత్రి కూడా ఉండటం గమనార్హం.

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ కు వచ్చిన జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాసా హయాషి… జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. తాజాగా ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన… తాను కూడా ఆర్.ఆర్.ఆర్. చూసినట్లు, మూవీలో నటించిన చరణ్ అండ్ ఎన్టీఆర్ ల నటన అద్బుతంగా ఉందని చెబుతూ.. తన ఫేవరెట్ యాక్టర్ మాత్రం ఎన్టీఆరే అంటూ చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో.. ఇటీవల విడుదలైన ఆర్.ఆర్.ఆర్. ను జపాన్ ప్రజలు ఎంతగానో అభిమానించారని ఆయన తెలిపారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదే సమయంలో… ఈ వీడియోని జూనియర్ అభిమానులు షేర్లు చేస్తూ గ్లోబల్ స్టార్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

కాగా… స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలతో ఫిక్షనల్ కథగా రూపుదిద్దుకున్న “ట్రిపుల్ ఆర్” చిత్రంలో అల్లూరిగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ మూవీలో ఎన్టీఆర్.. పులితో ఇంట్రడక్షన్ సీన్.. ఇంటర్వెల్ లో యానిమల్ ఫైట్ సీన్ లు ఇంటర్నేషనల్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ని ఒక సూపర్ హీరోలా చేసింది. అన్ని వయస్సులవారికీ నచ్చేలా చేసింది!