సెకండ్ ఇన్నంగ్స్‌లో పవన్ కళ్యాణ్ వరుసగా ప్రాజెక్టులు ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలతో ఫ్యాన్స్ దిల్ ఖుషీ చేసేశాడు పవన్ కళ్యాణ్.
ఓ పక్క రాజకీయాలూ, మరోపక్క సినిమాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికలు రాజకీయాల పరంగా పవన్‌కి వెరీ క్రూషియల్. సో, అప్పటికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సైన్ చేసిన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి వుంది పవన్ కళ్యాణ్.
ఆల్రెడీ సెట్స్ మీద వున్న ‘హరిహర వీరమల్లు’ ఎలాగూ కొన్ని నెలల్లో పూర్తవుతుంది. హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పట్టాలెక్కాల్సి వుంది. దాంతో పాటూ సుజిత్ సినిమా కూడా లైన్‌లోనే వుంది. వీటన్నింటితో పాటూ, రీమేక్ మూవీ ఒకటుంది. అదే సముద్రఖని డైరెక్ట్ చేయబోయే సినిమా. అయితే, ఈ సినిమా విషయంలోనే కాస్త తటపటాయింపులు జరుగుతున్నాయ్.
సముద్రఖని ప్లేస్‌ని మరో డైరెక్టర్‌తో రీప్లేస్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా 2024 లోపే ఈ సినిమాలకు సంబంధించి షూటింగులన్నీ పూర్తి చేసేయాలన్నది పవన్ యోచన.