ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుని తెలుగు సినీ పరిశ్రమ బహిష్కరించనుందన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు అదెలా సాధ్యం.? అన్న ప్రశ్న ఓ వైపు నుంచీ ‘ఎందుకు చేయకూడదు.?’ అన్న ప్రశ్న ఇంకో వైపు నుంచి వస్తోంది.
సంక్రాంతికి తన సినిమాని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసుకోవడమే దిల్ రాజు చేసిన నేరమా.? అని ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అది తప్పు కాదు, కానీ డబ్బింగ్ సినిమాని తీసుకొచ్చి.. స్ట్రెయిట్ తెలుగు సినిమాల్ని దిల్ రాజు చంపేస్తున్నారన్నది మెజార్టీ వాదన.
ఈ విషయంలో పరిశ్రమ పెద్దలు ఎంతలా నచ్చజెబుతున్నా దిల్ రాజు వినడంలేదు. పైగా కొత్త కొత్త వ్యూహాలు రచిస్తూ, ‘కసి’ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడట దిల్ రాజు. కొన్ని సినిమాల్ని తానే కొనేసి, వాటిని పెద్ద సినిమాలకు పోటీగా విడుదల చేయాలనుకుంటున్నాడట.
దిల్ రాజు ఇలా ఎందుకు చేస్తున్నాడు.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదే కొనసాగితే, దిల్ రాజుపై పరిశ్రమలో వేటు తప్పదు.. అన్న చర్చ జరుగుతోంది.