బిగ్ బాస్ రియాల్టీ షో తెచ్చే పాపులారిటీ అంతా ఇంతా కాదు.! కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడైతే, బిగ్ బాస్ రియాల్టీ షోకి వెళ్ళడమంటేనే, వున్న పాపులారిటీని పోగొట్టుకోవడం. ఈ భావన ఇప్పుడు చాలామందిలో వుంది.
ట్రోలింగ్ భరించడం ఇకపై చాలా చాలా కష్టం కాబోతోంది. అక్కినేని నాగార్జున మీదనే విపరీతమైన ఒత్తిడి వుంది ఈ విషయంలో.
‘నువ్వైతే వద్దు నాగార్జునా..’ అంటూ సోషల్ మీడియాలో నెటిజనం ట్రెండింగ్ చేస్తున్నారు. కానీ, ‘బిగ్ బాస్ తెలుగు’ నిర్వాహకులకు నాగార్జున తప్ప మరో ఆప్షన్ కనిపించడంలేదు. కంటెస్టెంట్ల వేట మాత్రం యాజ్ యూజువల్‌గా షురూ అయిపోయింది.
గత సీజన్‌లోనే అనామకులు చాలామంది వున్నారు. ఈసారి మరింత రొట్ట బ్యాచ్ రాబోతోందట. కాస్త ఫాలోయింగ్ వున్నవాళ్ళు సైతం, ‘సారీ బాస్..’ అనేస్తున్నారట. సో, రానున్న సీజన్ మరింత చప్పగా వుండబోతోందన్నమాట.