కుర్రాడి కథ మొదటికొచ్చింది.! ఆకాశం నుంచి పాతాళానికి.!

‘డీజె టిల్లు’ సినిమాతో ప్యాండమిక్ టైమ్‌లో అనూహ్యమైన విజయం సొంతం చేసుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా లాభాలు తెచ్చపెట్టేసింది.

దాంతో, ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశాడీ యంగ్ హీరో. అసలే మనోడికి ఆటిట్యూడ్ ఎక్కువ. ఆ ఆటిట్యూడ్‌‌కి తోడు సక్సెస్ వచ్చేసరికి కళ్లు నెత్తికెత్తేశాయనీ మాట్లాడుకుంటున్నారు. సీక్వెల్ విషయానికి వచ్చేసరికి డైరెక్టర్‌ని మార్చేశాడు. హీరోయిన్‌నీ మార్చేశాడు.

సర్వం తానే అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. హీరోయిన్‌గా ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ సెట్ అయ్యింది. మనోడి ఓవరాక్షన్ తట్టుకోలేక మధ్యలోంచే బయటికొచ్చేసింది. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలెట్టాడట టిల్లుగాడు. ఇంతవరకూ జరిగిన పరిణామాల దృష్ట్యా టిల్లుగానితో ఎట్టుంటదో.. అని హీరోయిన్లు ఒప్పుకునేందుకు సంశయిస్తున్నారట.

ఇక, నిర్మాతలు కూడా ఈ ఆటిట్యూడ్ కుర్రోడితో విసిగిపోయారనీ తెలుస్తోంది. దాంతో, నేనే డీల్ చేసుకుంటా.! అని సిద్దు నెక్స్‌ట్ లెవల్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడట. దాంతో సినిమా ముందుకెనళుతుందో లేదో తెలియని పరిస్థితి. అంతా సెట్ అయ్యి సినిమా పట్టాలెక్కితే ఓకే. లేదంటే, మనోడి పరిస్థితి అంతే సంగతి. ఎలా ఎదిగాడో.. అలాగే కాదు కాదు, అంతకన్నా దారుణంగా పాతాళానికి పడిపోతాడని సినీ మేథావులు మాట్లాడుకుంటున్నారు.