మెగాస్టార్ చిరంజీవితో హరీష్ శంకర్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడన్న గాసిప్ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అనుకోని కారణాల వల్ల ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, నిజంగానే ఆ సినిమా ఆగిపోయిందా.? లేదా.? అనే విషయం పక్కన పెడితే, చిరంజీవితో సినిమా తాజాగగా తెరపైకి వచ్చింది.
అయితే, చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్టతో ఒకటి, కళ్యాణ్ కృస్ణతో ఒక సినిమా ఆల్రెడీ కన్‌ఫామ్ అయిపోయాయ్. అయితే, తాజాగా హరీష్‌తో ప్రాజెక్ట్ తెరపైకి రావడం కాస్త ఆశ్చర్యంగానే తోస్తోంది.
అన్నీ కుదిరితే, ఈ సినిమా త్వరలో పట్టాలెక్కేలా వుందంటున్నారు. మైత్రీ మూవీస్, కొణిదెల ప్రొడక్సన్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. బహుశా ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ వెనక్కి వెళ్లడం వల్లే, ఇది ముందుకొస్తోందా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయ్. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.?