నిప్పు లేకుండా పొగ రాదు కదా.? ఈ రోజుల్లో వచ్చేస్తుంది. ‘ఈగిల్’ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9న సినిమా విడుదల కాబోతోంది. సంక్రాంతికి రావాల్సిన సినిమా, వెనక్కి వెళ్ళడం వెనుక పెద్ద కథే నడిచింది. అటు నిర్మాణ సంస్థతోపాటు, ఇటు హీరో రవితేజనీ బుజ్జగించేందుకు కొందరు నిర్మాతలు నానా తంటాలూ పడ్డారట.
ఇలాంటి విషయాల్లో రవితేజ ఒకింత నిక్కచ్చిగా వుంటాడనీ, డబ్బు మనిషి అనీ.. ఓ వాదన వుంది. ‘అబ్బే, అదేం లేదు.. రవితేజ వైపు నుంచి అస్సలు ఇబ్బంది రాలేదు’ అనే మాట బయటకు వినిపిస్తున్నా, లోలోపల వేరే టాక్ ప్రచారమవుతోంది.
‘ఈగిల్’ సినిమా కోసం సంక్రాంతి సినిమాల నిర్మాతలు (ముగ్గురు) ప్రత్యేక రాయల్టీ చెల్లించారంటూ ఓ గుసగుస గట్టిగా వినిపిస్తోంది. అసలు ఇలాంటివి వుంటాయా.? అంటే, ఎందుకు వుండవ్.? అనే వారూ లేకపోలేదు.
నిజమేనా.? ఆ రాయల్టీ ఎంత.? రవితేజ కదా.. రాయల్టీ గట్టిగానే వుండి వుంటుందని అంటున్నారు. రవితేజ అండ్ టీమ్ మాత్రం, ‘మెరుగైన సినిమా పరిశ్రమ’ కోసం అన్నట్టుగా, తమ సినిమా వాయిదా గురించి ఘనంగా ప్రకటించేసుకుంది. ఇంతకీ, నిజమేంటంటారు.? రవితేజ సుద్దపూస అనుకోవచ్చా.?