2023లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా షురూ చేసింది. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయి.
ఇక, ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పుల దిశగా అధినాయకత్వం చర్యలు చేపడుతుందా.? పార్టీలో రేవంత్ రెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకత వుంది. అలాంటి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా వుంటే, మంచి అవకాశాన్ని చేజార్చుకున్నట్లవుతుందంటూ పలువురు కాంగ్రెస్ నేతలు, అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నారట.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక జరిగిన పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని తీసెయ్యడమే మేలన్నది కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే, రేవంత్ ప్లేస్‌లో అంతటి స్టామినా వున్న నాయకుడెవరు.? అన్నదే అసలు ప్రశ్న. సీనియర్ కేటగిరీలో చాలామంది వున్నారు. కానీ, పార్టీని ఏకతాటిపై నడిపే నాయకుడే లేడు. అదే కాంగ్రెస్ సమస్య.
కాంగ్రెస్ పార్టీలో ఏకంగా డజనుకు పైగానే ముఖ్యమంత్రి అభ్యర్థునదగ్గరవారున్నారు. అదే, తెలంగాణ కాంగ్రెస్‌కి పెద్ద సమస్య.