Cmantham Movie Review: సీమంతం మూవీ రివ్యూ & రేటింగ్ !!!

టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన క్రైమ్ థ్రిల్లర్ సీమంతం. హీరోగా వజ్రయోగి, హీరోయిన్‌గా శ్రేయ భర్తీ నటించారు. సుధాకర్ పాణి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల అయ్యింది.

ఈ చిత్రం ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా తెరకెక్కింది. సంగీతం ఎస్. సుహాస్ అందించారు. సీమంతం సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
సిటీ లో వరుసగా దారుణమైన హత్యలు జరుగుతుంటాయి… ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో పోలీస్ వాళ్ళకి కూడా అర్ధంకాదు… అప్పుడు హీరో వజ్ర ఒక ప్రైవేట్ డిటెక్టివ్.. ఈ వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఎలా కనిపెట్టాడు ? అసలు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ? ఎవరు చేస్తున్నారు ? వంటి విషయాలు తెలియాలంటే సీమంతం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ హీరో వజ్ర హీరోయిన్ శ్రేయ తో ప్రేమకథ తో , వరుస హత్యలతో వెళ్తుంది.. ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో ముగుస్తుంది…. సెకండ్ లో హీరో ఎలా సాల్వ్ స్క్రీన్ప్లే చాలా ఆసక్తిగా ఉందిది… చెప్పాలంటే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది…. ఎవరైతే హత్యలో చేస్తున్నారో వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ మెయిన్ హైలైట్ సినిమాకి. ప్రజెంట్ బైట జరిగే యధార్థ సంఘటాలు ఆధారంగా తీసుకున్నారు, అన్నీ బాగున్నాయి.

డైరెక్టర్ సుధాకర్ పాణి తీసుకున్న లైన్ ను చాలా ఇంట్రెస్ట్ గా చెప్పారు.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లెయిమ్స్ అండ్ క్లైమాక్ సూపర్. అతను రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. సినిమాను గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు.

హీరో వజ్ర కొత్త వాడైన చాలా ఎనర్జీ పెర్ఫామేస్ ఇచ్చాడు… చాలా హుషారుగా చేశాడు ఫస్ట్ హాఫ్ లో.. ఒక రెండు మూడు సినిమాలు చేసిన హీరోల పెర్ఫామేస్ ఇచ్చాడు.. ఫైట్స్ లో కూడా బాగా చేశాడు.. హీరోయిన్ శ్రేయ గుడ్ లుకింగ్..

ఎస్. సుహాన్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి . ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చాడు… అమర్ ఎడిటింగ్ సినిమా కు బాగా హెల్ప్ అయ్యింది. ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిస్పీగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. రీచ్ గా ఉంది మూవీ. నిర్మాతలు రాజీపడకుండా ఖర్చు పెట్టారు. సినిమా విజువల్ పరంగా కూడా గ్రాండ్ గా ఉంది. శ్రీనివాస్ విన్నకోట కెమరా వర్క్ బాగుంది.

ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీమంతం సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. థ్రిల్లర్ ఫిలిమ్స్ ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఈ సినిమాకు మరింత ఎంగేజ్ అవుతారు. రెండు గంటల్లో ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ నుండి బయటికి వస్తారు. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్నీ ఈ సినిమాకు చక్కగా కుదిరాయి. అంతా కొత్తవారు చేసినా అనుభవం కలిగిన వారిలాగా ఈ సినిమాను తీర్చిదిద్దారు.

రేటింగ్: 2.5/5

Public EXPOSED: Chandrababu Super Six Schemes || Ap Public Talk || Ys Jagan || Pawan Kalyan || TR