‘వాల్తేరు వీరయ్య’ కోసం మాస్ రాజా రవితేజ, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేశాడు. సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. నిజంగానే రవితేజకు కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఇది.. అంటూ విమర్శకుల ప్రశంసలు అందాయ్ ఈ సినిమాతో. అయినా ఇంకా తనివి తీరలేదట. అన్నయ్యతో ఇంకోస్సారి అంటున్నాడట రవితేజ.
అందుకోసం మళ్లీ బాబీనే దువ్వుతున్నాడట కూడా. ఈ ప్రాజెక్ట్ కోసం అంతకు మించి అనేలా మరో ఆలోచన కూడా చేస్తున్నాడు రవితేజ అని ప్రచారం. ఫుల్ లెంగ్త్ కామెడీతో, క్లాస్ టచ్ వున్న మాస్ కామెడీ అని తెలుస్తోంది. ‘దొంగనాడుడుకులు’ అనే తరహాలో వుండబోతోందట. అంతే కాదు, అలాంటి కథలు కావాలని ఇటు చిరంజీవి, అటు రవితేజ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో యంగ్ డైరెక్టర్స్‌కి సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే.
అన్నీ కుదిరితే, ‘భోళా శంకర్’ పూర్తయ్యాకా, ఈ తరహా కొత్త ప్రాజెక్ట్‌ని సెట్స్ మీదికి తెచ్చేసేలా వున్నారు మెగాస్టార్ చిరంజీవి. అన్నట్లు కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. అలాగే, రవితేజ కూడా నిర్మాణంలో భాగస్వామి కావాలనుకుంటున్నాడట. అదీ సంగతి.