చంద్రబాబు కటిక పేదరికంలో జన్మించారు. అందుకే ఆయనకు విలాసాలు అంటే తగని మక్కువ. ఇతరుల సొమ్ముతో జల్సాలు చెయ్యడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రత్యేకవిమానాలు, రాజప్రసాదాలూ, మందీమార్బలం, బాజాభజంత్రీలు అంటే ఆయనకు చిన్నప్పటినుంచి మోజు. రాజకీయాల్లో చేరి అవినీతి అక్రమాలతో వేలకోట్ల రూపాయలను ఆర్జించి ఆ కోరికలు అన్నీ తీర్చుకున్నారు ఆయన. ఓకే. అందులో తప్పేమీ లేదు.
పేదలంటే ఆయనకు గిట్టదు
చంద్రబాబుకు పేదవారన్నా, పేదరికమన్నా చాలా అసహ్యం. తనకన్నా ధనవంతులు, కోట్లాధిపతులు అంటే ఆయనకు భలే ఇష్టం. కష్టాలు, కన్నీళ్లు ఆయనకు సరిపోని అంశాలు. సుఖాలు, జల్సాలు ఆయనకు ప్రీతిపాత్రం. ఇక రాజకీయాల్లో ఎంత అట్టడుగు స్థాయి కార్యకర్త అయినా, నాయకుడైనా ఏదొక సందర్భంలో అధికారపార్టీమీద పోరాటం చేసి ఉంటాడు. లేదా పోరాటంలో పాల్గొని ఉంటాడు. కానీ, చంద్రబాబుకు అలాంటి పోరాటాలు, సమరాలు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒళ్ళు వంచి పనిచెయ్యడం, ఫలితాలు అనుభవించడం, తనను నమ్ముకున్నవారికి దిశానిర్దేశం చెయ్యడం, స్ఫూర్తిని కలిగించడం ఆయన నిఘంటువులో ఎక్కడా కనిపించవు. కేసీఆర్ లాగా, జగన్ మోహన్ రెడ్డి లాగా సొంత పార్టీలు పెట్టుకుని ఏటికి ఎదురీది, కష్టాలకు నష్టాలకు ఓర్చి, కార్యకర్తలను, నాయకులను ప్రోది చేసి, జనం బలంతో అధికారాన్ని చేజిక్కించుకున్న యోధుడు కాదు. చివరి నిముషం వరకు మామగారికి తెలియకుండా ఆయన కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు, కోడళ్ళు, సన్నిహితులు, అధికారులు, వ్యవస్థలు, అందరినీ లోబరుచుకుని కుతంత్రాలు, కుట్రలు పన్ని, వెన్నుపోట్లు పొడిచి అధికారలక్ష్మిని చెరపట్టిన ప్రజాస్వామ్య హంతకుడు మాత్రమే. ఆ తరువాత ఆయన బీజేపీతో కొన్నిసార్లు, కమ్యూనిస్టులతో కొన్నిసార్లు, టీఆరెస్, జనసేన, లోక్ సత్తా, కాంగ్రెస్ పార్టీలతో ఏమాత్రం సైద్ధాంతిక నీతి జాతి లేకుండా పరమ నికృష్టమైన రాజకీయాలు నెరపి రాజకీయాలనే సర్వనాశనం చేసిన అనైతికుడు. ఆయనకు అధికారం ముఖ్యం తప్ప సిద్ధాంతాలు కానేకావు. డబ్బుకోసం ఏమైనా చెయ్యగలడు. ఎందరికైనా వెన్నుపోటు పొడవగలడు. పోరాటం అనేది ఆయన రక్తంలో లేని పదార్ధం.
కన్నభూమి అంటే అసహ్యం
ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకు చిన్నప్పటినుంచి చిన్నచూపే. ఆయన ఆస్తిపాస్తులు, వ్యాపారాలు, భవనాలు, స్థలాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. అంతెందుకు? రాష్ట్రం చీలిపోయి తన రాజకీయ ప్రస్థానం కొనసాగాల్సింది ఆంధ్రప్రదేశ్ లోనే అని ఎరిగిన తరువాత కూడా తెలంగాణాలో తన రాజభవనాన్ని నిర్మించుకున్నారంటే అర్ధం ఏమిటి? ఎవరైనా సొంత ఇంటిని ఎందుకు నిర్మించుకుంటారు? తాను ఎక్కడ స్థిరపడదలచుకున్నాడో అక్కడ సొంత గూడును నిర్మించుకుంటారు. చంద్రబాబు హైద్రాబాద్ లో మూడువందల కోట్ల రూపాయలతో సొంత మహారాజభవనాన్ని నిర్మించుకున్నారంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్ అంటే అసహ్యం అని తేలిపోవడం లేదూ? తెలంగాణాలో శాశ్వతంగా స్థిరపడాలని ఆయన ముందే ప్లాన్ వేసుకున్నారన్నమాట! అధికారం వస్తే ఆంధ్రాలో దర్జాలు, ప్రతిపక్షం అయితే తెలంగాణాలో విశ్రాంతి! ఇదీ చంద్రబాబు అభిమతం!!
కరోనా సాకుతో తెలంగాణాలో ముఖం చాటేశారు
గత ఎనిమిది మాసాలుగా దేశమంతా విస్తరించిన కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో తన విశ్వరూపం చూపించింది. లక్షలాదిమంది కరోనా బారిన పడ్డారు. వేలాదిమంది మరణించారు. వ్యాపారాలు మూతపడ్డాయి. ఇలాంటి విపత్కర సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన చంద్రబాబు కరోనాకు భయపడి తెలంగాణాలో దాక్కున్నారు! పోనీ కరోనా అంటే భయపడి ప్రజలను కూడా ఇళ్లలోనే కూర్చోమని చెప్పారా? అమరావతి పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో గత పదినెలలుగా టెంట్లు వేసి డ్రామాలు ఆడిస్తున్నారు! తాను, తన కుటుంబం హైదరాబాద్ లో భద్రంగా ఉండాలా? అమాయకులు మాత్రం కరోనా బీభత్సంలో కూడా రోడ్లమీద ఉద్యమాలు చెయ్యాలా? వారివి మాత్రం ప్రాణాలు కావా? “కనీసం కరోనా సమయంలో ఇళ్లలో కూర్చుని ప్రాణాలు కాపాడుకోండి…అమరావతి సాధన తరువాత చూద్దాం” అని ప్రజలకు ధైర్యం చెప్పాలనే ఇంగితం కూడా చంద్రబాబులో లోపించింది. జూమ్ లో కూర్చుని ప్రజలను రెచ్చగొట్టడం, వారిని ఆందోళనలు, ధర్నాలు చేయమనడం, తాను, తన కుమారుడు మాత్రం ఇంట్లో దాక్కోవడం! ఇదీ చంద్రబాబు వరుస!
జనం లోకి రావాలంటే భయం
కరోనా ఉధృతి తగ్గింది. జనజీవన స్రవంతి యధావిధిగా మారిపోయింది. వ్యాపారాలు, ఆఫీసులు, ఇతర కార్యకలాపాలు మొదలయ్యాయి. రాజకీయ నాయకులు మళ్ళీ ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు కన్నా పెద్దవారు, సమకాలీనులు ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు…ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా రాకపోకలు ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ చంద్రబాబుకు కరోనా అంటే చచ్చే భయం! కరోనా పేరు చెప్పి బయట కాలు పెట్టడానికే వణికిపోతున్నాడు! ప్రాణం అంటే ఎంత తీపి!
వెన్నుపోటు పొడిచి కైలాసానికి పంపడానికి కరోనా భూతం ఏమైనా ఆయన మామగారా??
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు