బీజేపీ కామెడీలు

bjp have overconfidence on tirupati by election
దుబ్బాక ఉపఎన్నికలో చచ్చీచెడీ శాయంగల విన్నపాలు అన్నట్లు చావుతప్పి కన్ను లొట్టపోయి గెలవగానే ఇక తిరుపతి కూడా మాదే అన్న వెర్రి ధీమా ఆంధ్రా బీజేపీలో పెరిగింది.  తెలంగాణాలో పరిస్థితులు వేరు. తెలంగాణాలో బీజేపీకి చాలాకాలంగా ఉనికి ఉన్నది.  అక్కడ వెంకయ్య నాయుడు లాంటి నాయకులు లేరు.  బీజేపీ అంటే చిత్తశుద్ధి, విశ్వాసం కలిగిన దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు, రాంమాధవ్  లాంటి నాయకులు ఉన్నారు.  కానీ ఆంధ్రాలో అందరూ చంద్రబాబు బానిసలు, కోవర్టులు, కులపిచ్చిగాళ్ళు అందరూ బీజేపీ ముసుగులు వేసుకుని గత నలభై ఏళ్లుగా ఆ పార్టీని వీలైనంత లోతుగా పాతిపెట్టారు.  
 
bjp have overconfidence on tirupati by election
bjp have overconfidence on tirupati by election
ఇక కాస్తో కూస్తో ఒరిజినల్ అనదగ్గ నాయకులు కూడా లేకపోలేదు.  సోము వీర్రాజు, జివిఎల్  నరసింహారావు లాంటి నాయకులు ఉన్నారు.  కానీ వీరెవ్వరూ ప్రజాకర్షణ కలిగిన నాయకులు కారు.  ఒక వీధిలో నిలబడి పొలికేక పెడితే పదిమంది కూడా పోగుకారు.  ప్రత్యక్ష ఎన్నికల్లో వీరు గెలవరు.  అయితే వీరి మాటకారితనం, విశ్వసనీయత, చిత్తశుద్ధి లాంటి కొన్ని లక్షణాల వలన అధిష్టానానికి ప్రీతిపాత్రులు అవుతారు.  
 
ఇక జివిఎల్ నరసింహారావు తాజాగా మాట్లాడుతూ ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని సెలవిచ్చారు. తెలంగాణాలో బండి సంజయ్ పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని హెచ్చరించారు.  అంటే పాతబస్తీలో పలుకుబడి కలిగిన మజ్లీస్ పార్టీ మీద దండయాత్ర చేస్తామని వారి భావం కాబోలు.  అయితే బీజేపీ వారి సర్జికల్ స్ట్రైక్ పాతబస్తీలో ఏమాత్రం పని చెయ్యలేదు.  అక్కడ మజ్లీస్ వెంట్రుక కూడా రాలలేదు. ఆ కోణంలోనుంచి చూస్తే బీజేపీ సర్జికల్ స్ట్రైక్ విఫలం అయినట్లే.  
 
మరి ఏపీలో తిరుపతిలో కూడా బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా?  తెలంగాణాలో అంటే బీజేపీకి పునాది ఉంది.  అభిమానులు ఉన్నారు.  ఆంధ్రాలో ఏముంది వారికి?  వారంటే ప్రజలకు ద్వేషం ఉన్నది.  తిరుపతిలోనే వారిచ్చిన ప్రత్యేక హోదా మాట నీటిమూట అయింది. ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారు అని ప్రజలు నిలదీస్తే జివిఎల్ ఏమని సమాధానం ఇస్తారు? సర్జికల్ స్ట్రైక్ అనేది విధ్వంసక చర్య. అంటే బీజేపీకి విధ్వంసం సృష్టించడం తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు చెయ్యడం చేతకాదని చెప్పుకోవడమే కదా!  
 
దానికి బదులు పోలవరాన్ని కేంద్రంతో చెప్పి నిర్మిస్తాం.  రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తాం.  ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం నిధులతో నిర్మిస్తాం లాంటి ప్రజలు మెచ్చే పలుకులు మాట్లాడి ఓట్లు అడిగితె ప్రజలు సంతోషిస్తారు.  జివిఎల్ లాంటివారు తమ అతి తెలివితేటలతో ప్రజలతో సర్జికల్ స్ట్రైక్ చేయించుకోకుండా పార్టీకి వచ్చే నాలుగు ఓట్లు రానిస్తే అదే మహాభాగ్యం.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు