ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర ఘోరమైన వైఫల్యం అందుకున్న చిత్రాల్లో ఎపిక్ డిజాస్టర్ చిత్రం “ఏజెంట్” కూడా ఒకటి. అక్కినేని వారు హీరో అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సేషనల్ హైప్ ని రిలీజ్ కి ముందు తెచ్చుకుంది.
అయితే అప్పటికే చాలా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ చిత్రం నెమ్మదిగా హైప్ ని కూడా తగ్గించుకుంది. దీనితో ఫైనల్ గా పాన్ ఇండియా నుంచి జస్ట్ రెండు భాషల్లో మాత్రమే సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఈ అవైటెడ్ సినిమా థియేటర్స్ లో మాసివ్ ప్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా నష్టాలు చూసారు.
ఐతే ఈ ప్లాప్ ని చిత్ర యూనిట్ తీసుకొని స్పందించి తాము బౌన్స్ బ్యాక్ అవుతాము అని చెప్పాలి. అయితే ఈ తర్వాత ఈ చిత్రం ఓటిటి రిలీజ్ విషయంలో కూడా బాగా సస్పెన్స్ నడిచింది. సినిమా వచ్చిన నెల లోపే నిజానికి ఈ సినిమా హక్కులు ఉన్న సంస్థ సోనీ లివ్ వారు డేట్ ఇచ్చేసారు. కానీ అనూహ్యంగా ఈ రిలీజ్ ని ఆపేసారు.
దీనితో ఏజెంట్ ఓటిటి రిలీజ్ అందని ద్రాక్ష లానే మిగిలిపోగా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తూ వచ్చారు. ఇక ఫైనల్ గా అయితే దీనిపై బిగ్ అప్డేట్ ఇపుడు వచ్చింది. కాగా సోనీ లివ్ వారు ఇచ్చిన అఫీషియల్ అప్డేట్ తో అయితే ఈ చిత్రం ఏఈ సెప్టెంబర్ 29న స్ట్రీమింగ్ కి రానుంది అని కన్ఫర్మ్ చేశారు.
దీనితో ఈ సినిమా కోసం వెయిట్ చేసిన వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో నటించగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. అలాగే అనిల్ సుంకర నిర్మాణం వహించారు.
https://x.com/SonyLIV/status/1705152456051532263?s=20