ఆయా రాశుల వారు ఆయా క్షేత్రాలను సందర్శించడం వలన అనేక శుభపలితాలు కలుగుతాయి. వృషభరాశివారు అంటే కృత్తిక 2 ,3 , 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1 , 2 పాదములు. ఈ,ఊ,ఏ,ఓ , వా,వీ,వు,వే,వో. ఈ అక్షరాల పేర్లమీద ఉన్నవారు వృషభరాశివారు. వీరు దర్శించాల్సిన క్షేత్రం – “సోమనాధ జ్యోతిర్లింగము”
పఠించాల్సిన క్షేత్రం:
“సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,
భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే.”
ఈ రాశి శుక్రునికి స్వ గృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున ఏలినాటి శని, అష్టమ, అర్థ అష్టమ శని, ఇతర శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, చిత్రపటం పూజ మందిరమందు ఉంచి నిత్యమూ పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుద్రాభిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.