జ్యోతిషం ప్రకారం మనకు 12 రాశులు. వీటిలో ప్రథమ రాశి మేషరాశి. అయితే అనేక పరిహారాలో భాగంగా దేశంలోని జ్యోతిర్లింగ దర్శనం కూడా ఒక పవర్‌పుల్ పరిహారం. అయితే ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించాలో తెలుసుకునే దానిలో భాగంగా నేడు మేషరాశి గురించి తెలుసుకుందాం…
మేషరాశి: అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం చూ, చే, చొ,లా,లీ,లూ ,లే.
వీరు దర్శించాల్సిన క్షేత్రం రామేశ్వర జ్యోతిర్లింగం.
రామేశ్వరం :
“సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి.”
ఈ రాశి కుజునికి స్వగృహం, రవికి ఉచ్చ క్షేత్రం, శనికి నీచ క్షేత్రం. మేషరాశి వారు ఏలినాటి శని బాధలకు ఎక్కువగా గురి అవుతారు. ఇది చర రాశి. చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. ఏలినాటి శని, అష్టమ శని, ఇతర శని బాధలకు, ముఖ్యంగా మేష రాశి శని ఉన్న రెండు న్నర సంవత్సరములు గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, రామేశ్వర చిత్ర పటమును పూజ మందిరంలో ఉంచి రోజు పూజ చేసికొనుట, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, యెర్ర వస్త్ర దానములుకుడా చేసిన మంచి ఫలితమలు కలుగుతాయి.