సనాతన ధర్మంలో ఏ దైవ కార్యక్రమం అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది.దాదాపు అన్ని దైవ కార్యక్రమాల్లోనూ విఘ్నేశ్వర మంత్రాలను తప్పనిసరిగా ఉచ్చరిస్తారు. వీటిని అత్యంత శక్తివంతమైనవి నమ్ముతారు. హిందూ సంప్రదాయం శైవం, వైష్ణవం అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని ఆచారాల్లోనూ వినాయకుని ప్రార్థన, పూజ సాధారణం.
ఓ గం గణపతియే నమ: ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. గణేశుడుకి సంబంధించి అనేక మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ సమాన శక్తివంతమైనవే. వీటిలో మీకు ఇష్టమైన దానిని ఎంపిక చేసుకుని ఉచ్చరించవచ్చు. ఏదైనా మంత్రం తాలూకా సామర్ధ్యం ప్రాథమికంగా భావాలు, భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది. అలా పఠించినప్పుడే మరింత తీవ్రమైన ప్రభావం చూపుతుంది. చిలుకకు మనం నేర్పించిందే మళ్లీ వినిపిస్తుంది. దానికి అర్థం చేసుకునే కళగానీ, ప్రాముఖ్యత తెలియదు. అలాగే మంత్రోచ్ఛారణ విషయంలోనూ అర్థం తెలియకుండా వల్లిస్తే ప్రయోజం లభించదు.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గః గణపతయేనమః అనే మంత్రం కూడా చాలా పవర్ ఫుల్. దీన్ని శుచి, శుబ్రతలతో పఠించాలి. కనీసం 21 సార్లు పఠిస్తే మంచిది. ఉచ్చరణ లోపం లేకుండా స్వామిని ఆరాధించాలి. ఇక బీజాక్షరాలు సరిగ్గా పలుకలేం అనుకుంటే ఓం గం గణపతయేనమః అనే మంత్రం జపిస్తే చాలు అన్ని శుభాలు కలుగుతాయి. ఇది ఎందరో ఆచరించి, సిద్ధిపొందారు.
గణేష్ ఆరాధన ఫోటోలు వాడగలరు