ముఖ్యమైన పనిమీద ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ పనులు చేస్తే విజయం మీ సొంతం..?

మన భారతీయ సంస్కృతిలో ఆచారాలకు సాంప్రదాయాలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా హిందూ ప్రజలు ఈ సంస్కృతి , సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వీటిలో భాగంగా ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని ఆచారాలు, పద్ధతిలో పాటిస్తూ ఉంటారు. సాధారణంగా ముఖ్యమైన పనుల కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు రాహుకాలం లేకుండా శుభ గడియలలో ఇంటి నుండి బయటకు వెళ్తారు. అలాగే బయటికి వెళ్లినప్పుడు కొన్ని రకాల పక్షులు, జంతువులు ఎదురుపడినప్పుడు కొద్దిసేపు కూర్చొని నీరు తాగి వెళ్లే పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు.

అయితే ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని రకాల పనులు చేయడం వల్ల కూడా అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోటిలో కొంచెం చక్కెర లేదా ఏదైనా తీపి పదార్థం తిని వెళ్ళాలి. ఇలా తీపి తిని వెళ్లడం వల్ల మన ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా వెళ్లిన పని విజయవంతంగా పూర్తి చేస్తారు. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో కలుగుతాయి. అందుకే ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు నోరు తీపి చేసుకోమని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

అలాగే ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళే ముందు విఘ్నేశ్వరునికి బెల్లం సమర్పించి వెళ్ళాలి. ఎందుకంటే బెల్లం అంటే గణపతికి ఎంతో ఇష్టం. అందువల్ల కొంచం బెల్లం ముక్క వినాయకుడి దగ్గర ఉంచి వెళ్లే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తి అవ్వాలని గణేశునికి నమస్కరించుకొని చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకొని బయటకు వెళ్లాలి. ఇలా తీపితిని ఇంటి నుండి బయటకు వెళ్లడం వల్ల మనం అనుకున్న పనులు అప్పటికప్పుడు నెరవేరకపోయినా కూడా కొంత కాలానికైనా అవి తప్పకుండా నెరవేరుతాయి.