రథసప్తమి విశిష్టత.. రథసప్తమి రోజున సూర్య భగవానుడి పూజా విధానం..!

హిందువులకు ఉత్తరాయంలో మాఘమాసము, దక్షిణాయంలో కార్తీకమాసము ఎంతో ప్రత్యేకమైనవి. తెలుగు మాసాలలో మాఘ మాసం కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో ఉదయాన్నే మాఘ స్నానాలు ఆచరించి భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా మాఘమాసం విష్ణుమూర్తి ఆరాధనకు, సూర్య భగవానుడి ఆదరణకు ఎంతో విశిష్టత ఉంది. ఇటువంటి పవిత్రమైన మాఘమాసంలో రథసప్తమి రావడమే ఈ మాసం యొక్క ప్రత్యేకత తెలియజేస్తుంది అని ప్రముఖ వేద పండితులు చెబుతున్నారు. ఈ మాఘమాసంలో ఆదివారం రోజున సూర్యారాధన చేయడం ఎంతో పుణ్యం కలగజేస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సప్తమి తిధి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజుగ పరిగణించారు. మన పురాణాలలో మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు సూర్య జయంతిగా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు తన తిధిని ఉత్తర స్థానానికి మార్చుకున్న రోజును రథసప్తమిగా పిలుస్తారు. ఇలా సూర్యుడు గతిలో మార్పు రావడం వలన అనారోగ్య సమస్యలు దూరమై ఆయురారోగ్యాలు ప్రాప్తి కలుగుతాయని నమ్మకం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రథసప్తమి రోజున ప్రజలు సూర్యారాధన చేస్తే వారికి ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి ఆయురారోగ్య, ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు.

రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు తల మీద ఉంచుకొని స్నానం చేయడం వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే రథసప్తమి రోజున తెల్లవాఋజామున నది స్నానం చేసి సూర్య భగవానునికి తర్పణాలు వదలాలి. అలాగే రథసప్తమి రోజున బెల్లంతో పరమాన్నం చేసి దానిని సూర్యునికి నైవేద్యంగా పెట్టాలి. సూర్య భగవానునికి సూర్యుని అష్టోత్తర శతమానవలితో పూజించడం ఎంతో మంచిది. సూర్యుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వేద పండితులు చెబుతుంటారు.