కలలో ఈ జంతువులు కనిపిస్తే అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతాలు…?

how-many-hours-of-sleep-do-i-need-jpg

సాధారణంగా ప్రతి ఒక్కరికి నిద్రపోయిన సమయంలో కలలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికే మంచి కలలు వస్తే మరి కొంతమందికి పీడకలలో వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో మన ఆలోచనలకు సంబంధం లేకుండా ఏవేవో కలలో కనిపిస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్ర ప్రకారం కలలు రావటం అనేది మన భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సంకేతాలుగా భావించవచ్చు. మన జీవితంలో జరగబోయే మంచి చెడుల గురించి అప్పుడప్పుడు కలల ద్వార ముందే తెలుస్తోంది. ఇదిలా ఉండగా కలలో కొన్ని రకాల జంతువులు కనిపించడం అనేది మీరు అదృష్టవంతులు కాబోతున్నారని తెలిపే సంకేతాలు. ఏ జంతువులు కలలో కనిపిస్తే మనకు మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవు : ఆవులో కోటి మంది దేవతలు కొలువై ఉంటారు. అందువల్ల ఆవుని దేవుడితో సమానంగా పూజిస్తారు.
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఆవును చూడటం చాలా శుభం.

గుడ్లగూబ :
కలలో గుడ్లగూబ కనిపించడం కూడా శుభసూచకం. ఇలా గుడ్ల గూబ కనిపిస్తే లక్ష్మి దేవి అనుగ్రహం లభించి ధనవంతులు అవుతారు.

నలుపు రంగు పాము :
కలలో నలుపు రంగు పాము కనిపించడం కూడా చాలా అదృష్టమే. కలలో నలుపు రంగు పాము కనిపిస్తే త్వరలో మీ కోరికలు నెరవేరుతాయి.

ఏనుగు :
కలలో ఏనుగును చూస్తే మీకు త్వరలో అదృష్టం కలిసివస్తుందని సంకేతం. ఇలా కలలో ఏనుగు కనిపించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని దూరం అవుతాయి.

బల్లి : కలలో బల్లి కనిపించడం కూడా శుభ సూచికంగా భావిస్తారు. కలలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తెలిపే సంకేతం.

కుందేలు : కలలో కుందేలు కనిపించడం అంటే భవిష్యత్తులో మీరు ధనవంతులు కాబోతున్నారని తెలిపే సంకేతం.