మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా విశిష్టత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి ముందు దీపం వెలిగించి ఆరాధిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. సిరిసంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనేక రకాల పూజలు పరిహారాలు చేయాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఎటువంటి పరిహారాలు, పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా లక్ష్మీదేవి ఫోటో నుంచి పూజించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తూర్పు దిశలో లక్ష్మీదేవి ఫోటోని ఉంచి పూజించటం వల్ల ఆ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిశగా ఉండేలా ఉంచి పూజించటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఇంట్లో ఎల్లప్పుడూ సిరిసంపదలకు లోటు ఉండదు. అయితే తూర్పు దిశలో ఉంచిన లక్ష్మీదేవి ఫోటోలో లక్ష్మీదేవికి ఇరువైపులా ఏనుగులు కాసుల వర్షం కురిపిస్తున్న ఫోటో ఉంచి పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేయటం వల్ల కూడా ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు. శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకొని పువ్వులతో అందంగా అలంకరించి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహానికి తామర పువ్వులు సమర్పించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది. ఇలా ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహానికి నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా చేయటం వల్ల ఆ దేవి అనుగ్రహంతో మనం చేపట్టిన పనులలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.