తిరుమల ఏడుకొండలలో ఒకటి గరుడాద్రి. సాక్షాత్తు విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు, ఆయన పేరుమీద వెలసిన కొండ ఇది. దీని వెనుక పురాణగాథ తెలుసుకుందాం…
దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి… తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.