సాధారణంగా ఏమైనా శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు వంటి కార్యక్రమాలలో ఇతరులకు బహుమతులు ఇస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రకాల వస్తువులను బహుమతిగా ఇవ్వటం వల్ల మన అదృష్టం పోయి దురదృష్టం చుట్టుకుంటుంది. ఏ ఏ వస్తువులను ఇతరులను బహుమతిగా ఇవ్వకూడదో.. వాటిని బహుమతిగా ఇవ్వటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తెలుసుకుందాం.
• సాధారణంగా యువ కార్యాలయంలో దేవుడి ఫోటోలు, ప్రతిమలు బహుమతిగా ఇస్తూ ఉంటారు. భగవంతునికి ప్రతిరూపంగా భావించే దేవుడి విగ్రహాలను ఇతరులకు బహుమతిగా ఇవ్వరాదు. మనం ఇచ్చిన బహుమతి అందుకున్న వారు దేవుడు విగ్రహాలను సరిగా ఊహించకపోతే వాటి చెడు పరిణామాలను మనం అనుభవించాల్సి వస్తుంది.
• అలాగే కొంతమంది విద్యార్థులకు పెన్ను, పుస్తకాలను బహుమతిగా ఇస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం పెన్నులు, ఇతర వస్తువులను గిఫ్టుగా ఇవ్వడం వల్ల వాటిని తీసుకున్నవారు ఎదగడానికి బదులుగా.. నష్టాల పాలవుతారని నిపుణులు చెబుతున్నారు.
• అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కూరగాయలను కూడా ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఒకవేళ బహుమతిగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే వారి వద్దనుండి కనీసం ఒక రూపాయి అయినా తీసుకోవాలి.
• అలాగే ఎండిపోయిన పువ్వులను కూడా పిల్లలకు బహుమతిగా ఇవ్వటం వల్ల మన జీవితంలో అదృష్టం దూరం అవుతుంది.
• గృహప్రవేశం, వివాహ శుభకార్యాలలో వంట గదిలో ఉపయోగించే కత్తి వంటి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వటం వల్ల మీకు వారికి మధ్య ఉన్న బంధం దెబ్బతింటుంది.
• సాధారణంగా కొంతమంది అక్వేరియం లను బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఇలా నీరు ఉన్న వస్తువులను బహుమతిగా ఇవ్వటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.