సమస్యలు తొలగిపోయి అదృష్టం వరించాలంటే శంఖాన్ని ఎలా పూజించాలో తెలుసా

మన హిందూ సంప్రదాయంలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవతలతో సమానంగా శంఖాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలసి సముద్ర మదనం చేసే సమయంలో విలువైన వస్తువులతో పాటు శంఖం కూడా లభించటం వల్ల శంకర్ ని దైవంతో సమానంగా భావిస్తారు. అయితే ఈ శంఖాలలో కూడా చాలా రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని రకాల శంఖాలను పూజలకు ఉపయోగిస్తే మరికొన్ని శంఖాలను ఊదటానికి ఉపయోగిస్తారు. అయితే ఏ రకమైన శంఖాలను పూజించటం వల్ల అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం శంఖాలలో వివిధ రకాలున్నాయి. అయితే వీటన్నింటిలోకి 10 రకాల శంఖాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. వీటిలో కామధేను శంఖం, గణేష శంఖం, అన్నపూర్ణ శంఖం, మోతీ శంఖం, విష్ణు శంఖం, ఐరావత శంఖం, పౌండ్ర శంఖం, మణిపుష్ప శంఖం, దేవదత శంఖం, దక్షిణావర్తి శంఖం వంటి పది రకాల శంఖాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిలో కొన్ని రకాల శంఖాలను పూజలో ఉపయోగిస్తారు మరికొన్నింటిని పూజా సమయంలో శంఖారావం చేయటానికి ఉపయోగిస్తారు. అయితే వీటిలో ఉన్న కొన్ని రకాల శంఖాలతో శంకుస్థాపన చేయటం వల్ల వారి ఇంట్లో ఎల్లప్పుడూ సిరిసంపదలు సుఖసంతోషాలు తులుతూగుతూ ఉంటాయి.

ఎంతో పరమ పవిత్రమైన ఈ పది రకాల శంఖాలలో విష్ణు శంఖం, దక్షిణావర్తి శంఖం, మోతీ శంఖాలను ఇంట్లో పూజ గదిలో ఉంచి ప్రతిరోజు పూజించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలు వెళ్లి విరస్తాయని నమ్మకం. ప్రతిరోజు ఇంట్లో శంఖాన్ని పూజించటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వాసం. ఇలా శంఖాన్ని పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలకు తావు ఉండదు. అలాగే ప్రతిరోజు శంఖాన్ని పూజించటం వల్ల ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.