సాధారణంగా హిందువులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిత్యం దీపారాధన చేసి భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటారు.ఇలా నిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉండి మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సకల సంపదలను కలిగిస్తారని భావిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు ఎంతోమంది పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఇకపోతే చాలామంది ఇళ్లల్లో కాస్త పగిలిపోయిన విగ్రహాలు ఫోటోలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా పూజలు చేస్తుంటారు.
ఈ విధంగా ఇంట్లో పగిలిపోయిన ఫోటోలు లేదా విరిగిపోయిన విగ్రహాలు, ఇకపోతే ఫోటోలు పాతబడి బూజు పట్టినవి ఉన్నప్పటికీ అలాగే పూజ చేస్తుంటారు. అయితే ఇలా పూజ చేయడం పరమ దరిద్రం. ఏ ఇంట్లో అయితే ఇలా పగిలిపోయి బూజు పట్టిన ఫోటోలు విగ్రహాలు ఉంటాయో వెంటనే వాటిని తొలగించడం శుభప్రదం. అదేవిధంగా దేవుని గదిలో ఎక్కువ ఫోటోలు లేకుండా ఎత్తైన విగ్రహాలు లేకుండా చూసుకోవాలి. ఇలా పగిలిపోయిన ఫోటోలు కనుక ఉంటే వెంటనే వాటిని తీసి పారుతున్నటువంటి నీటిలో నిమర్జనం చేయాలి.
ఇలా వాటిని నిమర్జనం చేసిన అనంతరం వాటి స్థానంలో కొత్త ఫోటోలను తీసుకొని పూజించాలి.ఈ విధంగా పగిలిపోయిన బూజు పట్టిన ఫోటోలకు పూజ చేయడం వల్ల మనం చేసిన పూజకు ఎలాంటి ఫలితం ఉండదు. మనం చేసినటువంటి ఈ పూజ వ్యర్థం అవడమే కాకుండా మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఇంట్లో చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వంటివి జరుగుతుంటాయి. అందుకే పగిలిపోయినటువంటి ఫోటోలను లేదా విగ్రహాలను పారుతున్న నీటిలో నిమజ్జనం చేయడం ఎంతో ముఖ్యం.