వైఎస్సార్ అంటే కరుణానిధికి ఎంత అభిమానమో తెలుసా?

తమిళ రాజకీయాలు ఎవరికైనా ఒక పట్టాన అర్థం కావు. తమిళనాడును పాలించిన ముఖ్యమంత్రుల్లో చాలామంది తమిళేతరులే కావడం చరిత్ర చెబుతున్న సత్యం. అందులో జయ లలిత, కరుణానిధి కూడా తమిళులు కారు. కరుణానిధి తెలుగు వాడే అని చెబుతారు. ఆయన మూలాలు తెలుగు నేలలోనే ఉన్నాయని అంటున్నారు. తమిళనాడు సిఎం గా చేసిన కరుణానిధికి వైఎస్సార్ అంటే ఎంతటి అభిమానం ఉండేదో తెలియాలంటే ఈ చిన్న స్టరీ చదవండి.

ఎంజిఆర్ సిఎంగా పనిచేస్తున్న రోజుల్లో కరుణానిధి చేసిన ఒక విమర్శ వివాదాస్పదమైంది. ఒక మలయాళీ తమిళులను ఏలడమా? ఇదెక్కడి దారుణం అంటూ కరుణానిధి రాజకీయ విమర్శలు గుప్పించారు. అప్పుడు కరుణ విమర్శలను ఎదుర్కోవడంలో ఎంజిఆర్ తడబడ్డారు. ఆ సమయంలో ఎంజిఆర్ కేబినెట్ మినిస్టర్ కుళందైవేలు కరుణానిధి ఒక బాంబు పేల్చి కరుణానిధి నోరు మూయించారు. అదేమంటే ఎంజిఆర్ మలయాళీ అంటున్నారు సరే కరుణానిధి మాత్రం తెలుగు వాడు కాదా అని ప్రశ్నించారు. అప్పటి ఎంజిఆర్ కేబినెట్ మినిస్టర్ చేసిన విమర్శలను కరుణానిధి ఖండించలేదు. అంతేకాదు అప్పటినుంచి సిఎం ను మలయాళీ అనే విమర్శలు కూడా చేయడం స్టాప్ చేశారు. ఆ సంఘటనలు కరుణానిధి తెలుగువాడే అనడానికి నిదర్శనాలు అని అక్కడివారు చెప్పుకుంటారు. కానీ ఏనాడూ తమిళుడిగానే చెప్పుకుని గర్వపడ్డారు తప్ప కరుణానిధి తాను తెలుగు వ్యక్తిని అని ఓపెన్ గా ఎప్పుడూ చెప్పుకోలేదు.

కానీ లోలోపల తెలుగు పట్ల మమకారం ఉండేదని చెప్పడానికి ఇంకో సంఘటనను చెప్పుకోవచ్చు. అదేమంటే ఉమ్మడి రాష్ట్ర సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు తమిళనాడులో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. అంతేకాదు డిఎంకె పార్టీ జెండాను అవనతం చేశారు. నిజానికి తమిళ కరుణానిధి అయినా, తెలుగు వైఎస్సార్ అయినా ఇద్దరూ ఓటమెరుగని నాయకులే. కరుణానిధి పోటీ చేసిన ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. అలాగే తెలుగు నేల మీద రాజశేఖరరెడ్డి కూడా పోటీ చేసిన ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. బహుషా ఆ కారణంగానే వైఎస్సార్ అంటే కరుణానిధికి అభిమానం ఏర్పడి ఉండవచ్చన్న ప్రచారం ఉంది.

ఇంకో విషయమేమంటే కరుణానిధి పార్టీలో కీలక స్థానాల్లో నేతలు తెలుగు వారు ఉండడం విశేషం. పలు జిల్లాల్లో కూడా తెలుగు వారికి కీలక బాధ్యతలు అప్పగించారు.