పబ్ జీ గేమ్ ఆడి ఆడి చివరకు తన ప్రాణాలే పొగొట్టుకున్నాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లికి చెందిన సాగర్ కు 20 ఏండ్లు. అతను గత కొద్ది రోజులుగా పబ్ జీ గేమ్ ఆడుతున్నాడు. టైం పాస్ గా ఆడటం ప్రారంభించిన సాగర్ కు ఈ గేమ్ వ్యసనంలా మారింది. ఎప్పుడు చూడూ గేమే ఆడేవాడు. దీంతో అతని మెడ నరాలు పట్టుకున్నాయి.
తల్లిదండ్రులు అతనిని హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చేర్పించారు. గత 5 రోజులుగా వైద్యులు చికిత్స అందించినా సాగర్ మెడనరాలలో మార్పు రాలేదు. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో అతను గురువారం మృతి చెందాడు. పబ్ జీ గేమ్ తో సాగర్ చనిపోవడంతో అతని స్నేహితులు అవేర్ నెస్ వీడియో చేసి అవగాహన కల్పిస్తున్నారు.