అల్లుడిని పథకం వేసిన మామ.. చివరికి తల్లి దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

భార్యా భర్తల మధ్య గొడవలు సహజంగా వస్తూ ఉంటాయి. అయితే అలాంటప్పుడు సర్దుకుపోతూ ఉండాలి. అలా కాదని ఇద్దరు కోపాలకు వెళితే వారి సంసార జీవితం చిన్నాభిన్నమై పోతుంది. ప్రస్తుతం కాలంలో అయితే భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలు ఎన్నో సమస్యలకు దారి తీస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆ మనస్పర్ధలు ఏకంగా ప్రాణాలు సైతం తీయవచ్చు.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జగిత్యాలలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే…

జగిత్యాల పట్టణ పరిధిలోని బిగ్ బజార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బీట్ బజార్ కు చెందిన మహేష్ తన కూతురు భవాని కిరణ్ అనే వ్యక్తి కి ఇచ్చి ఏడాదిన్నర క్రితం వివాహం జరిపించాడు. అయితే మొదట్లో కొంత కొంతకాలం ఆ దంపతులు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తడంతో భవాని తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన భర్తతో గొడవపడి వచ్చిన భవాని కొంతకాలంగా తన పుట్టింట్లోనే ఉంటుంది.

ఈ క్రమంలోనే తన కూతురిని కాపురానికి తీసుకెళ్ళమని భవాని తండ్రి మహేష్ కొన్నిసార్లు తన అల్లుడి బ్రతిమిలాడాడు. అంతేకాకుండా కూతురిని కాపురానికి తీసుకెళ్ళమని తన అల్లుడిని పలుమార్లు హెచ్చరించాడు. తాజాగా మరొకసారి ఇదే విషయంలో మాటా మాటా రావడంతో పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో అల్లుడు కిరణ్ ని చంపేందుకు మామ మహేష్ వెళ్ళాడు. అప్పుడు కిరణ్ ఇంట్లో లేకపోవడంతో అతని తల్లి యమునా పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు మహేష్.దీనిని గమనించిన స్థానికులు గాయపడిన యమునను హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం యమునా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.