మహిళను ఆత్మహత్య చేసుకునేలా చేసిన వరదలు..!

గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన వర్షాలతో తెలుగు రాష్ట్రాలలో తీవ్రమైన వరదలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ఎంతోమంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. నివసించే ఇల్లు కూడా మునిగిపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో తాము కష్టపడి కట్టుకున్న ఇల్లు వరదల్లో మునిగిపోయింది అని మంచిర్యాలకు చెందిన జమున అనే 62 ఏళ్ల మహిళ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.

జమున భర్త వీరయ్య కూరగాయలు అమ్ముతూ తమ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక వీళ్ళు తము దాచుకున్న డబ్బుతో కలిపి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇక ఇటీవలే గోదావరి వరదలకు ఇల్లు మునిగిపోవడంతో.. అందులో ఉన్న విలువైన వస్తువులు పాడవటమే కాకుండా.. ఇల్లు బాగు చేయించాలంటే లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది అని మనస్థాపంతో ఉరి వేసుకొని చనిపోయింది. ప్రస్తుతం ఈ ఘటన అందరిని కలకల రేపుతుంది.