చదువుకోవడానికి వచ్చి అక్క మొగుడితో….

 

అక్కకు పెళ్లి అయ్యింది. ఉన్నంతలో హైదరాబాద్ లో కాపురం పెట్టింది. ఇంతలో తన చెల్లి పట్నంలో చదివితే బాగుంటది అని ఆ అక్క ఆశపడి తన దగ్గరకే పిలిపించుకొని హైదరాబాద్ లో చదివిస్తుంది. చదువుకుంటదుకు వచ్చిన యువతికి అక్క భర్తతో ఏర్పడిన సాన్నిహిత్యం అక్రమ సంబంధానికి దారితీసింది. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లకు చెందిన నర్సింహులు ఫిలింనగర్ లోని మహాత్మాగాంధీ నగర్ లో నివాసముంటున్నాడు. 16 ఏళ్ల క్రితం నర్సింహ్మకు వివాహమైంది. ఈ క్రమంలోనే నర్సింహ్మ భార్య సోదరి సునీత ఇంటర్ చదువుకోవడానికి హైదరాబాద్ కు అక్క వద్దకు వచ్చింది. ఇంటర్ పూర్తి చేసిన సునీతతో నరసింహులు సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ విషయం అందరికి తెలియడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

మేస్త్రీ పనిచేసే నర్సింహులు మంగళవారం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో బజ్జీలు తేవాలంటూ సునీతకు సూచించాడు. ఆమె వెళ్లలేదు. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో తానే వెళ్లి బజ్జీలు తెచ్చుకున్నాడు. ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవు. బజ్జీలు తెచ్చుకుంటావా అంటూ సునీత గొడవ పడింది. ఈ సమయంలో నర్సింహులు భార్య, కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయారు.

గొడవతో మనస్థాపం చెందిన సునీత ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన నర్సింహులు కుమార్తె చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే సునీత ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.