వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. కట్టుకున్న భర్త అన్న ప్రేమ కూడా లేకుండా తెగిడిస్తున్నారు. భార్యలు భర్తలను చంపడం, భర్తలు భార్యలను చంపడం సాధారణమైపోయింది. తాజాగా బోయిన్ పల్లిలో వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్ బోయిన్ పల్లి పరిధికి చెందిన జహేదా బేగం, బాబాఖాన్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే జహేదా బేగానికి కొన్నాళ్ల క్రితం మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త బాబాఖాన్ తాగి వస్తున్నాడని అతనితో నిత్యం గొడవపడేది. బాబాఖాన్ పని చేసుకునేవాడు మరియు కుటుంబాన్ని కూడా అతనే నడిపేవాడు. జహేదా మరో వ్యక్తి మోజులో పడి భర్తను నిర్లక్ష్యం చేసింది. ఏకంగా భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. రాను రాను ఎంతలా దిగజారిందంటే రాత్రి వేళలో భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడితో గడిపేది. భర్తకు నీళ్లలో నిద్రమాత్రలు ఇచ్చి కలిపేది. ఆ తర్వాత భర్త నిద్రలోకి జారుకోగానే పక్క రూంలో ప్రియుడితో కలిసి సరసాలు సాగించేంది. అలా కొన్నాళ్ల క్రితం నుంచి సాగుతోంది.
ఓ రోజు వీరిద్దరు కలిసి ఉండగా భర్త నిద్ర లేచాడు. దీంతో వెంటనే ప్రియుడు భర్తకు అవుపడకుండా పారిపోయాడు. క్షణంలో వీరి బండారం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. భర్త ఉంటే ఎప్పటికైనా ముప్పేనని భావించింది. ప్రియుని ముగ్గురి స్నేహితులతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఎప్పటిలాగానే భర్తకు నిద్రమాత్రలు ఇచ్చింది. భర్త నిద్రలోకి జారుకోగానే ప్రియుడు, అతని స్నేహితులు అతనికి ఊపిరాడకుండా చేసి చంపారు. ఆ తర్వాత భర్త గుండె నొప్పితో చనిపోయాడని బంధువులకు చెప్పి అతని దహన సంస్కారాలు కూడా చేయించింది.
అయితే బాబాఖాన్ బంధువుకు దీని పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు మృతదేహాన్ని తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తమదైన శైలిలో జహేదా బేగాన్ని విచారించగా అసలు నిజాలు తెలిపింది. దీంతో పోలీసులు హత్య చేసిన వారితో పాటు జహేదాబేగాన్ని అదుపులోకి తీసుకున్నారు.