హైదరాబాద్ లో దారుణం జరిగింది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య మరువక ముందే అటువంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లోని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ జరిగింది. బోరబండకు చెందిన నవదీప్ ఎస్సీ కులానికి చెందిన వాడు. మాధవి బీసి కులానికి చెందిన అమ్మాయి. వీరిద్దరు 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితమే ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కులాంతర వివాహం చేసుకుందని కోపంతో ఉన్న మాధవి తండ్రి కొత్త బట్టలు కొనిస్తామని నమ్మించి కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడి చేశాడు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజి వీడియో కింద ఉంది చూడండి.
యువతి తండ్రి బైక్‌పై వచ్చి తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. స్థానికుల అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రేమజంటను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అయితే దాడికి పాల్పడింది మాధవి మేనమామ లేదా ఆమె తండ్రా అనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో సోమాజి గూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. నవదీప్ ను ఎర్రగడ్డలోని నీలిమ ఆసుపత్రికి తరలించారు.