ఈ మధ్యకాలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు తరచూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణం కాగా ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మరికొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది.
ఇకపోతే తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఇలాంటి ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎంను కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తోన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఇకపోతే చెందిన యువకుడు ప్రముఖ రాజకీయ నాయకుడు సీనియర్ నేత కుమారుడని తెలుస్తుంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల టీఆర్ఎస్ కీలక నాయకుడు రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి కుమారుడు దినేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఇక ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టారు.
అయితే దినేష్ అక్కడికక్కడే మృతి చెందడంతో సమాచారం తల్లిదండ్రులకు చేరవేశారు. ఇక సీనియర్ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి కుమారుడు మృతి చెందారు అనే విషయం తెలియడంతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.