రాజేంద్రనగర్‌లో హత్య జరిగిందిలా (ఎక్స్‌ క్లూజివ్ వీడియోలు)

హైదరాబాద్ అత్తాపూర్ లో దారుణం జరిగింది. నడి రోడ్డు పై ఫిల్లర్ నం. 145 వద్ద అందరూ చూస్తుండగానే రమేష్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు వేటాడి.. వెంటాడి చంపారు. ఈ హత్యకు పాతకక్షలే కారణంగా తెలుస్తోంది. వదిలి వేయాలని వేడుకున్నా వారు కనికరించలేదు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా గొడ్డళ్లు చూపడంతో భయపడి వెనక్కి తగ్గారు. ఈ లోపు దారుణం జరిగింది. 

మృతుడు రమేష్ శంషాబాద్ లో మహేష్ అనే యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు. రాజేంద్రనగర్ కోర్టుకు హాజరై వెళుతుండగా కాపుకాసిన మహేష్ బంధువులు రమేష్ ను వేటాడి వెంటాడి చంపారు. హత్య జరిగిన తీరు వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

నడి రోడ్డు పై రమేష్ ను వేటాడి దాడి చేస్తున్న దుండగులు 

 

ఇలా ఇష్టమొచ్చినట్టు నరికారు