కట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్ లో దాచిపెట్టిన భర్త..?

ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయి. ఇలా మొదలైన చిన్న చిన్న గొడవలు ఆ తర్వాత పెద్దవిగా మారుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడానికి అక్రమ సంబంధం ప్రధాన కారణం. ప్రస్తుత కాలంలో భార్య భర్తలు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల గొడవలు జరిగి హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఛత్తీస్గడ్ లో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అన్న అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేసి మొక్కలు మొక్కలుగా నరికి ఆ తర్వాత వాటర్ ట్యాంకులో దాచి పెట్టాడు.

వివరాలలోకి వెళితే…ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ నగరంలో
బిలాస్పూర్ చక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్లాపూర్ దగ్గర జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంటి పై కప్పు మీద ఉన్న వాటర్ ట్యాంక్ లో మహిళా మృతదేహం లభ్యమవటంతో పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో బాధితురాలు భర్త పై అనుమానం వచ్చిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భార్య మీద అనుమానం పెంచుకున్న ఆమె భర్త అనుమానంతో ఈ దారుణానికి వడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. రెండు నెలలుగా భార్య కనిపించకపోయినా కూడా మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వకపోవడమే కాకుండా ఇంటి పైన ఉన్న సింటెక్స్ లోనే ఆమె మృతదేహం లభ్యం అవ్వడంతో భర్త ఈ దారుణానికి వడిగట్టి ఉంటాడని పోలీసులు ఆ దిశగా విచారణ చేపడుతున్నారు.