కాఫీ కోసం గొడవపడి అత్త ప్రాణాలు తీసిన కోడలు..?

సాధారణంగా ఇంట్లో అత్త కోడల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగే చిన్న చిన్న గొడవలు కారణంగానే కుటుంబాలు విడిపోవడమే కాకుండా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా మరికొంతమంది దారుణంగా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాఫీ కోసం అత్తా కోడలి మధ్య మొదలైన గొడవ వల్ల చివరికి అత్త ప్రాణాలు కోల్పోయింది.

వివరాలలోకి వెళితే..పుదుక్కొట్టై జిల్లాలోని మలైక్కుడిపట్టిలో వేల్, పళనియమ్మాళ్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, సుబ్రమణ్యన్ అనే కుమారుడు ఉన్నారు. సుబ్రమణ్యన్‌కి వివాహం జరిగింది. భర్త లేకపోవడంతో పళినియమ్మాళ్‌ తన కొడుకు, కోడలి వద్దే ఉంటోంది. పెళ్లైన కొత్తలో అత్త కోడలు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. కానీ కాలం గడిచే కొద్ది వారి మధ్య చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు ఏర్పడే తరచూ గొడవలు జరిగేవి. ప్రతీ చిన్న విషయంలోనూ ‘నువ్వా-నేనా’ అన్నట్టు గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికొచ్చిన పళనియమ్మాళ్‌.. కోడలిని పిలిచి తన కోసం టీ పెట్టాలని కోరింది. అయిష్టంగానే కోడలు టీ పెట్టి ఇచ్చింది. అయితే.. టీ చల్లారిపోవడంతో కోడల్ని అత్త మందలించింది.

దీంతో ఆ ఇద్దరి మధ్య మళ్లీ మాటామాట పెరిగి, గొడవ పెద్దదయింది. ఈ క్రమంలోనే కోడలు తీవ్ర ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డు తీసుకొని అత్త తలపై గట్టిగా బాదింది. దీంతో పళనియమ్మాళ్‌ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కోడలి మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేవలం టీ కోసం జరిగిన గొడవ వల్లే ఆమె హత్య చేసిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.