తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ అమ్మాయి

 హైదరాబాద్ లో దారుణం జరిగింది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25)   శనివారం ఆత్మహత్య కు పాల్పడింది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న శ్రీవిద్య ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. అయితే ఉదయం అయినప్పటికీ గది తలుపు తీయకపోవడంతో హాస్టల్ సిబ్బంది కిటీకీ నుంచి చూడగా, ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.

దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అరుణోదయ హాస్టల్ లో శ్రీవిద్య ఈ నెల 10న చేరింది. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  శ్రీవిద్యది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహరమా లేక పని ఒత్తిడి వల్ల చనిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవిద్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.