తండ్రి మందలించాడని మద్యం మత్తులో ఆ కొడుకు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఈమధ్య కాలంలో యువకులు ఎక్కువగా మధ్యానికి బానిసలు అవుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు వారిని మందలించి సరైన దారిలో పెట్టాలని చూస్తే పిల్లలు మాత్రం తల్లిదండ్రులను చంపటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. పక్కదారి పట్టిన కొడుకుని మందలించిన తండ్రి కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలలోకి వెళ్తే…కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు తన ఐదుగురు పిల్లలతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరయ్య పెద్ద కుమారుడు నరసింహులు తరచూ మద్యం సేవించి తండ్రితో గొడవ పడేవాడు. అంతేకాకుండా గ్రామస్తులతో కూడా దురుసుగా ప్రవర్తించడంతో ఇటీవల కొందరు గ్రామస్తులు వీరయ్యకు నరసింహులు మీద ఫిర్యాదు చేశారు.

దీంతో పక్కదారి పట్టిన కొడుకుని వీరయ్య మందలించాడు. అయితే అయితే తండ్రి మందలించడం జీర్ణించుకోలేని నరసింహులు ఇటీవల వీరయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత గొడ్డలి చేత పట్టుకొని గ్రామ వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేశాడు. స్థానికులు పోలీసులకి సమాచారం అందజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నరసింహులని అదుపులోకి తీసుకున్నారు.