జెసి దివాకర్ రెడ్డి కి ఆంధ్రా పోలీసుల సీరియస్ వార్నింగ్

అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి కి దిమ్మతిరేలా కౌంటర్ ఇచ్చారు అనంతపురం పోలీసులు. అనంతపురం పోలీసులకు సిగ్గు,శరం ఉందా అంటూ జెసి దివాకర్ రెడ్డి బూతుపురాణం అందుకున్న విషయం తెలిసిందే. పోలీసులు మొగోళ్లేనా అంటూ ఆయన వారిని అవమానకరంగా మాట్లాడారు. పోలీసుల భార్యా పిల్లలను సైతం అవమానించేలా మాట్లాడారు. గలీజు భాషలో వారిని నిందించారు. ఆశ్రమంలోని భక్తులు రాళ్లు వేస్తుంటే మాముందే పోలీసులు పారిపోయారని ఆరోపించారు. వాళ్లేం మగాళ్లు అని నిలదీశారు. ఎస్పీ నుంచి ఎస్సై వరకు చీము నెత్తురు లేవా అని ప్రశ్నించారు. 

అనంపురం రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు జెసి దివాకర్ రెడ్డికి ఒక సాధారణ సిఐ స్థాయి అధికారి ఇంతగా వార్నింగ్ ఇచ్చిన చరిత్ర లేదు. ఎంతసేపు ఎవరి మీద పడితే వారి మీద నోటి దురుసుతో బెదిరింపులకు పాల్పడిన చరిత్ర జెసి దివాకర్ రెడ్డికి ఉంది. జెసి తన జీవితంలో పోలీసు అధికారుల నుంచి ఇంతగా ఎదురు మాట్లాడిన పరిస్థితి లేదు.

కానీ గత కొద్దిరోజులుగా ఆశ్రమం వేదికగా సాగుతున్న రాజకీయాలు జెసిని ఇరకాటంలోకి నెట్టేశాయి. పోలీసులు జెసిపై తిరుగుబాటు చేశారు. జెసి దివాకర్ రెడ్డి మాటలతో ఆంధ్రా పోలీసులు రగిలిపోయారు. పొలిటికల్ వ్యవస్థపై తిరుగుబాటు చేశారు. కదిరి సిఐ తీవ్రమైన భాషలో పొలిటీషియన్లకు వార్నింగ్ ఇచ్చారు. జెసి మాట్లాడిన మాటలు మేమూ మాట్లాడగలం అని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం జెసి మాటలను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పోలీసు అధికారుల సంఘం నేత అనంతపురం జిల్లాలోని కదిరి సిఐ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ జెసి మాటలు విని రక్తం మరిగిపోయిందన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే నాలుక తెగ్గోస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

మీడియా సమావేశంలో కదిరి సిఐ మాధవ్ ఇంకా ఏం మాట్లాడారో కింద వివరాలు ఉన్నాయి చదవండి.

మా భార్య పిల్లలను అవమానించేలా మాట్లాడతారా?

అనంతపురం నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

ఎంపి, ఎమ్మెల్యేలు పోలీసుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తాం.

పోలీసులే కాదు పొలిటీషియన్లు ఫెయిల్ కారా?

తేడాగా మాట్లాడితే, అడ్గగోలుగా మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు.

పోలీసులను తిట్టడంలో టిడిపి, వైసిపి వాళ్లు ఇద్దరూ ఇద్దరే.

పోలీసులను తిడితే కొమ్ములొస్తాయని అనుకుంటున్నారా?

మీరు మాట్లాడే మాటలకు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు పోతాం.

నాగరికమైన వ్యవస్థలో నాగరికంగా ఉండాలి.

ఐపిఎస్ ఆఫీసర్లు, ఐఎఎస్ ఆఫీసర్లుగా సెలక్ట్ అయిన వాళ్లను కూడా తిడతారా?

మమ్మల్ని కించపరిచేలా మాట్లాడితే సీరియస్ గా తీసుకుంటాం.

మగాళ్లం కాబట్టే పోలీసు ఉద్యోగం చేస్తున్నాం. మేమేమీ శిఖండిలం కాదు. 

నాయకులు మాట్లాడే మాటలతో మా భార్యా పిల్లలకు మొహం చూపించలేకపోతున్నాం.

పోనీలే అని ఊరుకుంటుంటే నాయకులు హద్దు మీరి పోతున్నారు.

పోలీసు వ్వవస్థ అనేది బలమైన వ్యవస్థ. 

మీ అధికారం చూసి భయపడే పరిస్థితి ఉండదు. 

ప్రజా ప్రతినిధుల మాటలు చూసి బాధతోనే మాట్లాడుతున్నాను.

మాది కూడా రాయలసీమే. మేము కూడా పచ్చి బూతులు మాట్లాడగలం.

సభ్యత అడ్డొస్తదని ఊరుకుంటున్నం.

జెసి తక్షణమే క్షమాపణలు చెప్పాలి.

మేం కొజ్జాగాళ్లమై పోలీసు శాఖలోకి రాలేదు.

మా ఉనికికే ప్రమాదం వచ్చిందన్న భావనతోనే మేం మాట్లాడుతున్నాం.