పోలీసు సారు వివాహేతర సంబంధం కేసులో కొత్త ట్విస్టు (వీడియో)

ఆసిఫ్ నగర్ సీఐ రాజయ్య కేసులో సీన్ రివర్సయ్యింది. తన భార్య కావాలనే నాటకమాడుతూ డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని సీఐ రాజయ్య ఆరోపించారు. సరూర్ నగర్ పీఎస్ లో తన భార్య రేణుక పై సీఐ రాజయ్య ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. తన భర్త తనను పట్టించుకోకుండా మరో మహిళతో కాపురం పెట్టాడని సీఐ భార్య రేణుక సోమవారం కేసు పెట్టింది. రేణుక మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి. 

 

ci rajaiah case

సూర్యాపేట జిల్లా నారాయణ గూడ గ్రామానికి చెందిన రాజయ్య 2009లో కరణ్ కోర్ట్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేశారు. ఆ సమయంలో ఓ గొడవ విషయమై స్టేషన్ కు వచ్చిన రేణుకను రాజయ్య వలలో వేసుకొని 2009 మే 10 న యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నాడు. రేణుకను పెళ్లి చేసుకునేకంటే ముందే రాజయ్యకు రెండు పెళ్లిలయ్యాయి. ఈ విషయం దాచి రాజయ్య రేణుకను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఈ మధ్య కాలంలో రాజయ్య వేరే వివాహం చేసుకొని తనను పట్టించుకోకుండా వేధిస్తున్నాడని రేణుక సరూర్ నగర్ మహిళా స్టేషన్ లో ఫిర్యాదు చేసి సీపీకి కూడా ఫిర్యాదు చేసింది.

తనను మన్సూరాబాద్ లో ఉంచి వేరొక మహిళను మునగనూర్ లో ని స్వంత ఇంట్లో ఉంచాడని రేణుక తెలిపింది. తనను సొంతంగా బతకమంటున్నాడని రేణుక ఆరోపించింది. దీంతో పోలీసులు రాజయ్య పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు సీఐ రాజయ్య తన భార్య పై కేసు నమోదు చేయనుండటంతో కథ ఎలా అడ్డం తిరుగుతుందో అని అంతా చర్చించుకుంటున్నారు.