కరెంట్ షాక్ తో నల్లగొండ రైతు మృతి

కరెంటు షాక్ తో నల్లగొండ జిల్లాకు చెందిన రైతు ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ మండలం, కాకుల కొండారం గ్రామానికి చెందిన పాలకూరి నర్సింహ్మ గురువారం ఉదయం 10గంటల సమయంలో వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్ ఫార్మర్ ఆన్ చేసే ప్రయత్నంలో షాక్ తగిలింది. దీంతో నర్సింహ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తమ గ్రామానికి చెందిన రైతును పొట్టనపెట్టుకుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాకుల కొండారం రైతు పాలకూరి నర్సింహ్మ

నర్సింహ్మ మృతదేహానికి నల్లగొండలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విద్యుత్ అధికారులు నర్సింహ్మ మరణంపై స్పందించారు. డిపార్ట్ మెంట్ నుంచి రైతు కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రైతు పాలకూరి నర్సింహ్మ కరెంట్ షాక్ తో చనిపోయింది ఇక్కడే

పాలకూరి నర్సింహ్మ హఠాత్ మరణంతో కాకుల కొండారం గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.