హైదరాబాద్ లో దారుణం :   నడి రోడ్డు పై స్నేహితుడిని నరికి చంపాడు   (లైవ్ వీడియో)

హైదరాబాద్ నడిబొడ్డున పాతబస్తీలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపాడు. వారిద్దరు  స్నేహితులే. వారి మధ్య ఏర్పడిన చిన్న ఘర్షణ దారుణానికి దారితీసింది. అసలు వివరాలు ఏంటంటే..

చంచల్ గూడకు చెందిన షాకిర్ ఖురేషి, అబ్దుల్ ఖాజా స్నేహితులు. వీరిద్దరు కూడా ఆటో డ్రైవర్లే. ఖురేషి ఆటోను అకిల్ అనే వ్యక్తికి ఖాజా ఇచ్చాడు. తనకు తెలియకుండా ఆటోను వేరే వారికి ఎలా ఇస్తావని ఖురేషి ఖాజాతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ పెరగడంతో కోపంతో ఊగిపోయిన ఖాజా తన వద్ద ఉన్న కత్తితో ఖురేషిని  ఇష్టమొచ్చినట్టు నరికేశాడు.

అచేతనంగా ఉన్న ఖురేషిని  అక్కడ ఉన్న వారు ఎవ్వరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. అందరూ చూస్తుండగానే తల, మెడ, గొంతు పై పదిసార్లు నరికేశాడు. హత్య తర్వాత ఖాజా పారిపోకుండా అక్కడే ఉన్నాడు. హత్య జరుగుతున్నప్పుడు అక్కడికి ఓ పోలీస్ వచ్చినప్పటికి కూడా కనీసం కాపాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఓ వైపు తెలంగాణలో గుండాలు లేరు, మర్డర్లు లేవు.. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెబుతుంటే దారుణాలు మాత్రం జరుగుతునే ఉన్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. 

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన చెల్లి, తల్లిని దూషించడమే కాకుండా వారిని రేప్ చేస్తానని మాట్లాడడంతోనే ఖురేషిని హత్య చేశానని ఖాజా పోలీసులకు తెలిపాడు. ఖురేషి డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   మర్డర్ జరిగిన వీడియో కింద ఉంది చూడండి.