హైదరాబాద్ సంతోష్ నగర్ లో దారుణం జరిగింది. పంజాబ్ వివాహిత ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. పంజాబ్ కు చెందిన ముస్లిం వివాహిత సానియా సంతోష్ నగర్ లో నివాసం ఉంటుంది. సానియాకు సల్మాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో సానియా సల్మాన్ ను దూరం పెట్టింది.
సానియా మీద కోపంతో ఉన్న సల్మాన్ గురువారం ఉదయం సానియా ఇంటికి చేరుకొని గొడవకు దిగి ఆమెను కొట్టాడు. ఆ తర్వాత ఆమె చేతులు కాళ్లు కట్టేసి చిత్రహింసలు పెట్టి కిరోసిన్ ను ఆమె మీద పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చారు. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. ఆ తర్వాత సల్మాన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తనను దూరం పెట్టడం వల్ల కోపంతో తానే హత్య చేశానని సల్మాన్ ఒప్పుకున్నాడు. క్షణంలోనే దారుణం జరగడంతో సంతోష్ నగర్ లో విషాదచాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సానియా హత్యకు గురైన వీడియో కింద ఉంది చూడండి.