ఈ పోలీసు ఏం చేసిండో తెలుసా? (వీడియో)

ఈ రింగులో ఉన్న పోలీసు హైదరాబాద్ లో ఉన్న ఓ పోలీసు స్టేషన్ కు ఎస్ ఐ. ఈయన అప్పట్లో  ప్రస్తుత డిజిపి మహేందర్ రెడ్డి  నుంచి అవార్డు కూడా అందుకున్నాడు. హైదరాబాద్ పోలీసులు అంటే ఏట్ల ఉంటారో తెలుసు కదా ఫ్రెండ్లీ పోలీసు. అంతటా ఫ్రెండ్లీగా ఉంటారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం కొందరు పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటారు. మరి ఈ రింగులో ఉన్న పోలీసు ఏం చేసిండో తెలుసా…

అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వారే అడ్డదారి పడుతున్నారు. పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ, కానిస్టేబుల్ రూ. 50,000 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కారు. 2017 లో జరిగిన చీటింగ్ కేసును రాజీ కుదిర్చేందుకు బాధితుల నుంచి ఈ ఎస్ ఐ, కానిస్టేబుల్ కలిసి రెండు లక్షలు డిమాండ్ చేశారు. పోలీసు పట్టుబడ్డ వీడియో కింద ఉంది చూడండి.  

 

 బాధితుడు అంత ఇచ్చుకోలేనని 50 వేలిస్తానని ఒప్పుకున్నాడు. బాధితుడు విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. దీంతో ఎస్ ఐ సారంగపాణి, కానిస్టేబుల్ కిరణ్ కు బాధితుడు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.