ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన మధులిక మృత్యువను జయించింది. ఈ నెల 6న ప్రేమించలేదనే అక్కసుతో బర్కత్ పురకు చెందిన మధులిక పై భరత్ అనే యువకుడు కొబ్బరి బొండాల కత్తితో విచక్షణంగా దాడి చేశాడు. ఈ దాడిలో మధులిక తీవ్రంగా గాయపడడంతో వైద్యులు 12 సర్జరీలు చేశారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన మధులిక అందరి పూజలు ఫలించి మృత్యుంజయిరాలుగా నిలిచింది. బుధవారం మద్యాహ్నం మలక్ పేట యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
మధులిక జడ్జికి తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. మధులిక తన వాంగ్మూలంలో ఏం పేర్కొన్నదంటే…
“భరత్ తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఎప్పుడు కూడా స్నేహితుడిగానే చూశాను. కానీ గత సంవత్సరం నుంచి ప్రేమించమని వేధిస్తున్నాడు. ఇంట్లో చెప్పాను. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. అయినా నన్ను వేధించడం ఆపలేదు. దాడి రోజు నా తల్లిదండ్రులను రూంలో బంధించాడు. సందులోకి గుంజుకెళ్లి నా పై దాడి చేశాడు.
భరత్ బంధువులు అక్కడే ఉన్నా కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. నేను అరిచానా నాకు సహాయం చేయలేదు. నా తల్లిదండ్రులే వచ్చి నన్ను హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు” అని మధులిక తన స్టేట్ మెంట్ ఇచ్చింది.
మధులిక పై దాడి చేసిన నిందితుడు భరత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. మధులిక ఇంటర్ చదువుతోంది. దీంతో మధులిక ఎప్పుడు పరీక్షలు రాస్తామన్న తాము అనుమతిస్తామని ఇంటర్ బోర్డు ఎస్ ఎఫ్ ఐ విజ్జప్తితో స్పందించింది. మధులిక త్వరగా కోలుకోవడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు.