Gallery

Home Crime దేశంలోనే తొలి సెక్స్ టాయ్స్ స్టోర్..! ఎక్కడంటే..

దేశంలోనే తొలి సెక్స్ టాయ్స్ స్టోర్..! ఎక్కడంటే..

ఇండియాలో సెక్స్ టాయ్స్ స్టోర్ ఉంటుందంటే నమ్మగలమా..? కానీ.. ఉంది. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వెస్ట్రన్ కంట్రీస్ లో అదీ.. యూఎస్, యూకే, రష్యా, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉంటాయి. కానీ.. ఇండియాలో ఇటువంటి స్టోర్స్ విక్రయాలు అదీ బహిరంగంగా అసలు ఊహించలేం. కానీ.. ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. ఇంతకీ ఎక్కడనేగా..! ఇండియాకు ఫారిన్ టూరిస్టులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గోవాలో ఈ స్టోర్ ఏర్పాటయింది. ఇటువంటి స్టోర్ పెట్టాలనే ఆలోచన రావడమే ఓ సాహసోపేత నిర్ణయం. దేశంలోనే తొలి సెక్స్ టాయ్ స్టోర్ ని ఏర్పాటు చేసి తన ధైర్యం చూపించాడు ఆ వ్యాపారి. 

Gs 1 | Telugu Rajyam

రీసెంట్ లాక్ డౌన్ సమయంలో ఇండియాలో సెక్స్ టాయ్స్ ఎక్కువగా సేల్ అయ్యాయి. ఏకంగా 65 శాతం విక్రయాలు జరిగాయని మార్కెట్ వర్గాల గణాంకాలు చెప్తున్నాయి. కొందరు విదేశాల నుంచి తీసుకొచ్చి మరీ విక్రయిస్తున్నారు. ఆన్ లైన్లో కూడా వీటి గురించి సెర్చ్ చేసి మరీ తెప్పించుకుంటున్నారు. బహిరంగంగా ఎక్కడా ఇప్పటివరకూ ఇండియాలో స్టోర్ అయితే లేదు. ఈ డిమాండ్ చూసే గోవాలోని కలంగూటి బీచ్ రోడ్ లో ‘కామా గిజ్మోస్’ పేరుతో స్టోర్ ఏర్పాటు చేశాడో వ్యాపారి. ఫిబ్రవరి 14న ఈ స్టోర్ ప్రారంభమైంది. ఇక్కడ సెక్స్ టాయ్స్, వెల్ నెస్ ప్రొడక్ట్స్, కండోమ్స్, స్ప్రేలు, నావెల్టీ కండోమ్స్, జెల్స్, వైబ్రేటర్స్, పంపులు.. వంటివి విక్రయిస్తున్నారు.

వీటన్నింటికీ ఇండియాలో పెరిగిన డిమాండే తాము ఈ స్టోర్ ఏర్పాటు చేయడానికి కారణమని యజమాని అంటున్నాడు. ఇష్టమైన వారు ఈ స్టోర్ కు వెళ్లి తమకు కావాల్సిన ఉత్పత్తులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకోవచ్చని అంటున్నాడు. ఈ స్టోర్ కేవలం మినీ సూపర్ బజార్ లా ఉంటుందే కానీ.. ఎక్కడా అశ్లీలత ఉండదంటున్నాడు. అశ్లీలతను చూపే పోస్టర్లు కానీ.. యాడ్స్ కానీ ఉండవు. దీంతో దీనికి ఎటువంటి అడ్డంకులే లేవని అంటున్నాడు. కేవలం ఫారినర్స్ కు మాత్రమే ఎంట్రీ ఉన్న బీచ్ కూడా గోవాలో ఉంది. ఫారినర్స్ కు కూడా ఈ స్టోర్ ఉపయుక్తంగా ఉంటుంది. స్టోర్ లో దొరికే ఉత్పత్తులపై ఓ వీడియో కూడా రూపొందించారు. ఓ లుక్కేయండి..!

- Advertisement -

Related Posts

Crime: నకిలీ యాప్స్ తో 5 లక్షల మందికి టోకరా..! లక్షల్లో మోసం.. 11 మంది అరెస్టు

Crime: ఈజీ మనీ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించారు కొందరు మోసగాళ్లు. గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్ ల ద్వారా ఆకర్షించారు. దేశవ్యాప్తంగా 5లక్షల మందిని మోసం చేసి కోట్లలో...

దారుణం: కొడుకు కొట్టిన చెంపదెబ్బ.. తల్లి మృతి..! మనసుల్ని తొలిచేస్తున్న వీడియో

చిన్నప్పుడు తల్లి మాటే వేదంగా భావిస్తాడు కొడుకు. తల్లి మాట దాటడు. కానీ.. పెళ్లయ్యాక తల్లిని దూరం చేసిన వారు.. వృద్ధాశ్రమంలో చేర్పించిన వారూ ఉన్నారు. అయితే.. తల్లిని కొట్టి చంపిన కొడుకు...

మహిళపై మాజీ భర్త సోదరుడు అత్యాచారం..! ఎందుకీ దారుణమంటే..?

రాజస్థాన్ లో ఘోరం జరిగింది. ఓ మహిళ మాజీ భర్త సోదరుడు ఆమెపై అత్యాచారం చేశాడు. కానీ.. అతడిలో పశ్చాత్తాపం లేదు. ఆ మహిళ మాత్రం కుంగిపోయింది. పైగా.. తాను పెళ్లి చేసుకున్న...

Latest News