టిడిపి నేత బోండా ఉమ కు హై కోర్టు షాకింగ్ న్యూస్

విజయవాడ : టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా  ఉమా మహేశ్వరరావు కు ఇది షాకింగ్ న్యూస్. బోండా ఉమా దంపతులతో పాటు మరొక  9 మందిపై చర్యలు తీసుకోవాలని హై కోర్టు   ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు తయారీ, బెదిరింపులకు పడుతున్నట్టు  రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి విజయవాడ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 

దీనిని పోలీసులు ఖాతరుచేయలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోటేశ్వరరావు  హై కోర్టును ఆశ్రయించారు.  

ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఎమ్మెల్యే బోండా సహా 9 మందిపై చర్యలు చేపట్టాలని బెజవాడ పోలీసులకు  హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బోండా ఉమా మహేశ్వరావు మీద ఉన్న ఫిర్యాదు 

బోండా ఉమా విజయవాడ సమీపంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన భూమిని కాజేసేందుకు ప్రయ్నతించారని సమరయోధుడు సూర్యనారాయణ వారసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ భూమి బుడమేరు సమీపంలో ఉంటుంది. దీని ధర దాదాపు రు. 40 కోట్లు.తమ భూమిని కాజేసేందుకు బోండా ఉమ, ఆయనభార్య బోండా సుజాత మరొక ఎడుగురు కలసి ప్రయత్నిస్తున్నారని సూర్యనారాయణ  వారసుడు సురేష్ బాబు విజయవాడ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ  భూమిని కాజేసేందుకు బోండా గ్యాంగ్ ఒక ప్లాన్ వేసింది. ఈ భూమికి రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి ఓనరు అని అతని దగ్గిర నుంచి భూమి తాము కొంటున్నట్లు డాక్యుమెంట్ సృష్టించారు.  విషయం బయటకు పొక్కడంత కోటేశ్వరరావు అవాక్కయ్యాడు.అయితే, కోటేశ్వరరావు తమ విషయాలు బయటపెడతాడని గ్రహించి అతన్ని బెదిరించడం మొదలుపెట్టారుబోండా మనుషులు. దీనితో ఆయన పోలీసు కమిషనర్ ని, ఆతర్వాత కోర్టును ఆశ్రయించారు. కోటేశ్వరావు నుంచి తాము భూమికొన్నట్లు బోండా మనుషులు దబాయించారు. దీని మీద  ఒకపుడు ఎప్ ఐ ఆర్ కూడా నమోదయింది.