రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎపి సర్కారు తీపి కబురు అందించింది. ఎపిలో గ్రామీణ మండల రిపోర్టర్ మొదలుకొని జిల్లా, రాష్ట్ర స్థాయి జర్నలిస్టుందరికీ ఇంటి సౌకర్యం కల్పించేందుకు సర్కారు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హడావిడి మొదలుకాకముందే జర్నలిస్టులందరికీ ఇండ్ల నిర్మాణం పనులు మొదలు పెట్టించేందుకు అక్కడి ఎపిజెఎఫ్ (ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం) తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నది. దీనికోసం తక్షణమే ఒక వెబ్ సైట్ ను రూపొందించి అర్హులైన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎపిజెఎఫ్ నేత చెవుల కృష్ణాంజనేయులు వెల్లడించారు. ఎపిలో 17వేల మంది అక్రిడేషన్ కలిగి ఉన్నారని, అక్రిడేషన్లు లేనివారు మరో 7వేల మంది వరకు వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారని వారందరికీ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సర్కారుకు విన్నవించినట్లు చెప్పారు. వెబ్ సైట్ ఓపెన్ కాగానే జర్నలిస్టులందరూ తమ దరఖాస్తులను ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేయాలని సూచించారు. ఎన్నికల హడావిడి మొదలు కాకముందే ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.
జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణంపై ఎపిజెఎఫ్ నేత చెవుల కృష్ణాంజనేయులు ఫేస్ బుక్ లైవ్ లో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆ లైవ్ వీడియో కింద ఉంది చూడండి.