ఉస్మానియా యూనివర్సిటీ లో ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. వారాసిగూడలో నివాసముంటున్న అనూష (17) ను ప్రేమోన్మాది వెంకటేష్ హత్య చేశాడు.
అనూష హిమాయత్ నగర్ లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్నది. ఆమె హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసు వర్గాలు అంటున్నాయి.
వెంకటేష్ ఆమెను గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. వెంకటేష్ ప్రేమను అంగీకరించలేదన్న కారణంగానే ఆ స్టూడెంట్ ను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటన ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని డిస్టెన్స్ ఎడ్యూకేషన్ విభాగం సమీపంలో ఉన్న క్వార్టర్స్ వద్ద జరిగింది. అనూష గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు వెంకటేష్. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
అనూష మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హత్య వివరాలను సిఐ వెల్లడించారు. కింది వీడియోలో చూడండి.