కొండగట్టు బస్సు ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతి

 

ఆర్టీసి చరిత్రలో ఘోరమైన ప్రమాదం జగిత్యాల జిల్లాలో కొండగట్టు అంజన్న దేవాలయం సమీపంలో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మరణించారు. బస్సులో 80 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంపై సిఎం కేసిఆర్, రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ దిగ్రాంతి వ్యక్తం చేశారు. అవి వేగం, బ్రేకులు ఫెయిల్ అయిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది.

జగిత్యాల డిపోకు చెందిన ఈ ఆర్టీసి బస్సు డ్రైవర్ శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. బస్సు లోయలో పడిపోయిన సమయంలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్ రెండు కాళ్లు విరిగిపోయాయి. అందరు క్షతగాత్రులతోపాటే శ్రీనివాస్ ను కూడా ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ మరణించారు. 

శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్నాడు 

ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకుంటున్న డ్రైవర్ శ్రీనివాస్

ఈ ఏడాది పంద్రాగస్టు నాడు జగిత్యాల డిపో లో పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్ గా అవార్డు అందుకున్నాడు. కెఎంపిఎల్ పెంచి, అక్యూపెన్సీ రేషియో పెంచడంలో శ్రీనివాస్ సేవలను గుర్తించిన ఆర్టీసి మేనేజ్ మెంట్ ఆయనకు ఉత్తమ డ్రైవర్ అవార్డును అందజేసింది. ఇవాళ ప్రమాదం సమయంలోనూ డీజిల్ ఆదా చేయాలన్న ఉద్దేశంతోనే శ్రీనివాస్ బస్సు నడుపుతుండగా దురదృష్టవ శాత్తు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. సంఘటన జరిగిన వెంటనే మంత్రి ఈటల రాజేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. సిఎం కేసిఆర్ సంఘటనపై ప్రకటన వెలువరించారు. మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో శవాలన్నీ కుప్పలుగా పడి ఉన్నాయి. బస్సు లోపల కూడా రక్తసిక్తమైంది.

ఆర్టీసి డ్రైవర్ శ్రీనివాస్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఇంటివద్ద నుంచి వచ్చి డ్యూటీకి ఎక్కాడు. పెద్దగట్టు అంజన్న వద్దకు పోతున్నా.. నాకేమైతది అని బస్సు నడిపిండు. కానీ మానవ తప్పిదం కారణంగా బస్సు లోయల్ పడిపోతదని ఆయన అనుకోలేదు. మంగళవారం కావడంతో పెద్దగట్టు అంజన్న దర్శనం కోసం బస్సులో కిక్కిరిసేలా ఎక్కారు.  ఆర్టీసి పొదుపు చర్యల వత్తిడే ఈ బస్సు ప్రమాదానికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్యూపెన్సీ పెంచండి, కెఎంపిఎల్ పెంచండి అంటూ అస్తమానం ఆర్టీసీ డ్రైవర్లను ఉన్నతాధికారులు వత్తిడి పెడుతూ ఉంటారు. 

ఈ క్రమంలోనే జగిత్యాల బస్సు డ్రైవర్ శ్రీనివాస్ పొదుపుచర్యలు చేపట్టారు. డీజిల్ సేవ్ చేసేందుకు షార్ట్ కట్ రూట్ లో బస్సును నడిపినట్లు చెబుతున్నారు. ఆర్టీసి అధికారులు మాత్రం డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపినట్లు లీక్ ఇచ్చారు. సాధారణంగా ఆర్టీసి బస్సు డ్రైవర్ తాగి ఉంటే డ్యూటీ ఇవ్వకుండా పక్కన కూర్చోబెడతారు. కానీ డ్రైవర్ శ్రీనివాస్ తాగినట్లు ప్రచారంలో నిజం లేదని కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు. సంస్థ పెద్దల ఒత్తిడి కారణంగానే బస్సు ప్రమాదం జరిగిందని వారు చెబుతున్నారు.

ఈ ఘటనలో ప్రయాణీకులే కాకుండా డ్రైవర్ కూడా మరణించడం ఆర్టీసి వర్గాల్లోనూ విషాదం నింపింది.

శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్నాడు 
ఈ ఏడాది పంద్రాగస్టు నాడు జగిత్యాల డిపో లో పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్ గా అవార్డు అందుకున్నాడు. కెఎంపిఎల్ పెంచి, అక్యూపెన్సీ రేషియో పెంచడంలో శ్రీనివాస్ సేవలను గుర్తించిన ఆర్టీసి మేనేజ్ మెంట్ ఆయనకు ఉత్తమ డ్రైవర్ అవార్డును అందజేసింది. ఇవాళ ప్రమాదం సమయంలోనూ డీజిల్ ఆదా చేయాలన్న ఉద్దేశంతోనే శ్రీనివాస్ బస్సు నడుపుతుండగా దురదృష్టవ శాత్తు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.